జగన్ ను సీఎం చేసేందుకు సంతకం పెట్టా.. కానీ ! కన్నా షాకింగ్..!
ఏపీలో నిన్న దివంగత సీఎం వైఎస్సార్ పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో సంబరాలు చేసుకుంటున్న వైఎస్సార్సీపీ నేతలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో వైఎస్ పై మంత్రి అచ్చెన్నాయుడు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ చనిపోయినప్పుడు ఆయన విదేశాల్లో ఉన్నారని, ఆయన స్ధానంలో సీఎం అయ్యేందుకు సంతకాల సేకరణ చేపట్టారని, ఈ విషయం తనకు బొత్స సత్యనారాయణ చెప్పాలంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. వీటిని వెంటనే బొత్స ఖండించారు. ఈ సందర్భంగా బొత్స ఈ వ్యవహారంలోకి మరో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (kanna lakshminarayana)ను లాగారు.
వైఎస్ చనిపోయినప్పుడు జగన్ ను సీఎం చేయాలని తాను సంతకం చేయలేదని, అయితే అప్పుడు సంతకాలు చేసిన వారిలో కన్నా లక్ష్మీనారాయణ, రఘువీరారెడ్డి వంటి మాజీ మంత్రులు ఉన్నారని బొత్స తెలిపారు. దీనిపై ఇవాళ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. జగన్‌ను సీఎంను చేయాలని సంతకాల సేకరణ తానేతే చేయలేదని కన్నా తెలిపారు. వైఎస్ మీద ఉన్న గౌరవంతో, సంతకం మాత్రమే పెట్టానన్నారు.

జగన్ ఇలాంటి వాడని అప్పుడు తమకు తెలియదన్నారు. జగన్ సీఎం అయిన 3 నెలలకే.. ఇది రాక్షస పాలన అని చెప్పింది తానే అని కన్నా గుర్తుచేశారు. అలాగే బొత్స ఎందుకు ఎమోషనల్ అయ్యారో ఆయన్నే అడగాలన్నారు. దీంతో సంతకాల సేకరణ చేసింది ఎవరన్న ప్రశ్న అలాగే ఉండిపోయింది. దీనిపై బొత్స ప్రస్తావించిన మరో మాజీ మంత్రి రఘువీరారెడ్డి అయినా సమాధానం చెప్తారో లేదో చూడాల్సి ఉంది. గతంలో వైఎస్ చనిపోయినప్పుడు జగన్ ను సీఎం చేయాలని సంతకాల సేకరణ చేయడం వాస్తవమే అని బొత్స, కన్నా వ్యాఖ్యలతో స్పష్టమైంది. అయితే ఎవరు చేయించారన్నది మాత్రం తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications