• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

2022 కల్లా డబుల్ ఆదాయం: మోడీ ప్రభుత్వం సాధించేనా?

By Nitin Mehta & Pranav Gupta
|

న్యూఢిల్లీ: 2022 నాటికల్లా రైతుల ఆదాయం రెట్టింపు కావాలని గత ఏడాది ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ప్రతిష్టాత్మకమైన ఈ లక్ష్యంపై కొంచెం అనుమానాలు ఉండొచ్చు. కానీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం, ప్రోత్సహించడం కోసం, అలాగే వ్యవసాయ వృద్ధి రేటు పెంచడం కోసం నరేంద్ర మోడీ పలు కార్యక్రమాలు చేపడుతోంది. వీటిని చూద్దాం.

ప్రధానంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి క్రిషి సిచాయ్ యోజన, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీం అండ్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్‌లను విశ్లేషిద్దాం.

తొలి రెండేళ్లు ఎన్డీయే ప్రభుత్వంలో కరువు పరిస్థితులు కనిపించాయి. వ్యవసాయ ఆదాయంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఈ కరువు ప్రభావం కనిపించింది.

Doubling Farmer Income by 2022? Tracking Modi Government’s Progress on Agriculture

2015 తొలి నాళ్లలో రైతులకు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అకాల వర్షాలు, కరువు వల్ల పంట నష్టపోయారు.

భారతదేశంలో వ్యవసాయం ఎక్కువగా రుతుపవనాల పైనే ఆధారపడి ఉంది. ఇది రైతులకు ఇబ్బందికరంగా మారింది. వాతావరణం ఎక్కువగా రైతులకు నేచరల్ షాక్ ఇస్తుంటుంది. రైతులకు సాధ్యమైనంత మేర నష్టాన్ని తగ్గించడం, ఆర్థిక భద్రత కల్పించడం కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను (పీఎంఎఫ్‌బీవై) ప్రవేశ పెట్టారు.

పీఎంఎఫ్‌బీవై పురోగతి

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ్రవేశ పెట్టిన అనంతరం 23 శాతం నుంచి 30 శాతం క్రాప్ ఏరియా ఇన్సురెన్స్ కిందకు వచ్చింది. ఏడాదిలో ఇది మంచి పెరుగుదల. ఆ తర్వాత ఏడాదికి పది శాతం కవరేజ్ పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా 2019 కల్లా 50 శాతం చేయాలని చూస్తోంది.

పీఎంఎఫ్‌బీవైకు ఆర్థిక కేటాయింపులు కూడా క్రమంగా పెంచుతున్నారు. ఈ కేటాయింపులు రూ.5,500 కోట్ల నుంచి రూ.13,000 కోట్లకు పెరిగింది.

పీఎంఎఫ్‌బీవై కింద 35.5 మిలియన్ రైతులు ఇన్సూర్ అయి ఉన్నారు. 2013లో 12.1 మిలియన్ ఖరీఫ్ రైతులకు మాత్రమే ఇచ్చారు. 2015 ఖరీఫ్‌లో 25.4గా ఉంది. అప్పుడు నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సురెన్స్ స్కీం అండ్ మోడిఫైడ్ ఎన్ఏఐఎస్ కింద ఈ లబ్ధి చేకూరింది.

ఆ తర్వాత ఇన్సూర్ అయిన రైతులు 2015 ఖరీఫ్‌లో 60,773 కోట్లకు పెరిగింది. ఇప్పుడు పీఎంఎఫ్‌బీవై కింద 108,055 కోట్ల మంది రైతులు ఉన్నారు.

ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన

ఎక్కువ శాతం రుతు పవనాలపై ఆధారపడటం, వర్షం పైన ఆధారపడటమే భారతీయ వ్యవసాయానికి పెద్ద సమస్య. దేశంలో సగానికి పైగా వ్యవసాయం వర్షాధారం, ఇరిగేషన్ ఆధారితం.

2015లో కేంద్రం యాక్సిలరేటింగ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్ (ఏఐబీపీ)ను పునరుద్ధరించింది. ప్రధానమంత్రి కృషి సిచాయి యోజన (పీఎంకేఎస్‌వై)ని ప్రారంభించింది. ఇది గ్రామీణ సడక్ యోజన వంటిది అని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా రైతులకు ధీమాను ఇచ్చేందుకు ఈ కార్యక్రమం.

పీఎంకేఎస్‌వైలో పురోగతి ఎలా ఉంది?

ఈ పథకం కింద ప్రధాన్యతా క్రమంలో 99 ఇరిగేషన్ ప్రాజెక్టులను గుర్తించారు. ఇందులో 21 ప్రాజెక్టులు జూన్ 2017కు పూర్తి కానున్నాయి. మైక్రో ఇరిగేషన్‌ను దేశవ్యాప్తంగా పెంచడం కూడా దీని ఉద్దేశ్యం. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లను ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం. తద్వారా నీటి డిమాండును తగ్గించడం.

పీఎంకేఎస్‌వై ప్రోగ్రాం చేపట్టిన తర్వాత సూక్ష్మ సేధ్యంలో గణనీయమైన వృద్ధి కనిపించింది. 2005-06 నుంచి 2016-2017 మధ్య 60.83 హెక్టార్ల వ్యవసాయ భూమిని సూక్ష్మ సేద్యం కింద ఉంది.

గత తొమ్మిదేళ్లలో కేవలం 42.58 హెక్టార్లు మాత్రమే తీసుకు వచ్చారు. అంటే ఏడాదికి కేవలం 4.73 హెక్టార్లు మాత్రమే. కానీ ఇప్పుడు గత మూడేళ్లులో 18.25 హెక్టార్లు కలిసింది. అంటే సరాసరి 6 హెకార్టుగా ఉంది.

సాయిల్ హెల్త్ కార్డ్ స్కీం

ఏ నేలలో ఏ పంట వేయాలని రైతులకు సాయిల్ హెల్త్ కార్డ్ స్కీం కింద సూచనలు ఇస్తారు. తద్వారా ఉత్పత్తి పెంచడంపై దృష్టి సారించారు. ఇందుకోసం రైతులకు సాయిల్ హెల్త్ కార్డ్ స్కీం ప్రొవైడ్ చేసింది. ఆయా రైతుల వ్యవసాయ భూమిలో పంట గురించి సూచనలు ఇస్తారు.

ఏ విత్తనాలు వేయాలి, ఏ పెర్టిలైజర్ ఉపయోగించాలి.. తదితర అన్ని సూచనలు చేస్తారు. మార్చి 2012 వరకు దాదాపు 5 కోట్ల మంది రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు ఉన్నాయి. కానీ మోడీ ప్రభుత్వం వచ్చాక.. 2015 నుంచి మూడేళ్లలో 14 కోట్ల మంది రైతులకు ఈ కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రభుత్వం కేవలం సాయిల్ హెల్త్ కార్డులు మాత్రమే ఇవ్వడం కాదు. ప్రతి మూడేళ్లకు భూమి పరీక్షలు, తిరిగి సాయిల్ కార్డులు ఇవ్వడం చేస్తుంది.

మట్టి శాంపిల్ పరీక్షలు

గత రెండేళ్లులో మట్టి శాంపిల్ పరీక్షలో వృద్ధి కనిపించింది. 2.53 కోట్ల మట్టి పరీక్షలు జరపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తయింది. ఇప్పటి వరకు 7.11 కోట్ల కార్డులు ఇష్యూ చేశారు.

నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ (ఈ నామ్)

రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. వారు ఎక్కువగా ఎపీఎంసీలపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2016లో నామ్(ఎన్ఏఎం)ను లాంచ్ చేశారు. దీని ద్వారా రైతులకు నేషన్ వైడ్ మార్కెట్ విలువలు తెలుస్తాయి.

యూరియాకు వేప కోటింగ్

ప్రభుత్వం మరో ఉపయోగకరమైన, కీలకమైన స్టెప్ తీసుకుంది. అది యూరియాకు వేప కోటింగ్ వేయడం. ప్రస్తుతం డొమెస్టిక్ యూరియాకు మొత్తానికి కోటింగ్ వేస్తున్నారు. అంటే వంద శాతం. వేప కోటింగ్ ద్వారా అందులో న్యూట్రియెంట్ సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాదు, నాన్ అగ్రికల్చరల్ ఉపయోగానికి ఆ యూరియా వెళ్లకుండా అడ్డుకుంటోంది.

ముగింపు

మోడీ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఈ కార్యక్రమాల విజయం, రైతుల సమస్యలు తొలగిపోవడం వాటి అమలుపై ఆధారపడి ఉంటుంది.

ఉదాహరణకు, క్రాప్ ఇన్సురెన్స్ స్కీం క్లెయిమ్ చేసుకునే సమయం తక్కువగా ఉండాలి. అప్పుడు ఆ రైతుకు కూడా బాగుంటుంది. సాయిల్ హెల్త్ కార్డులు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం మానిటర్ చేయాలి. అలాగే, రైతులకు గిట్టుబాటు ధర కూడా వచ్చేలా చూడాలి.

English summary
Last year, Prime Minister Narendra Modi had declared that the government seeks to double farmer incomes by 2022.There is little doubt that this is an ambitious objective and requires a multi-pronged strategy by the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X