రైతులు వ్యవసాయంరంగం నుండి పారిపోవాలనుకుంటున్నారు: జెపి

పార్టీల విధానాల వల్లే వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకు పోయిందన్నారు. రైతును విస్మరిస్తే దేశమే సంక్షోభంలో పడిపోతుందన్నారు. వ్యవసాయంపై బ్రిటిష్ వారి విధానాన్నే మనమూ కొనసాగిస్తున్నామన్నారు. నష్టాలతో రైతు కంట కన్నీరు, గుండె నిండా ఆవేదనే ఉందన్నారు. రైతులతో 70 శాతం మంది తలసరి 15వేల ఆదాయంతో ఉంటున్నారన్నారు. కొందరు 7రెట్లు కంటే ఎక్కువ తలసరి ఆదాయంతో ఉన్నారన్నారు. రైతులు పంట రుణాలు తీసుకుంటే బీమా చెల్లించాలన్న నిబంధనలు సడలించారన్నారు.
రైతులకంటే కౌలు రైతులు మరింత ఎక్కునగా నష్టపోతున్నారన్నారు. కౌలుదార్లకు రుణాలు, రాయితీలు ఇతరత్రా భద్రత చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయ పనులను ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలని చెప్పారు. పార్టీల దగాకోరు విధానాల వల్లే రైతులకు ఇలాంటి దుస్థితి వచ్చిందన్నారు. గత పదెళ్లలో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతుల ఉత్పత్తులు అమ్ముకోవడానికి పక్క రాష్ట్రాల్లోలేని నిబంధనలు, ఆంక్షలు కేవలం మన రాష్ట్రంలోనే ఉన్నాయన్నారు. చాలామంది రైతులు వ్యవసాయరంగంనుండి పారిపోవాలనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్ద ఎత్తున ఉప్పుడు బియ్యాన్ని ప్రభుత్వం సేకరించాలని ఆయన సూచించారు. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి పత్తి ధరను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖను చూపారు. కరుణానిధి తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి పనులు చేస్తుంటే మనమంతా రైతులను ఆదుకోవటానికి అన్ని పార్టీలు ఒక్కటి అయి కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. వ్యవసాయానికి కనీస మద్దతు ధరను రూ.500లకు పెంచాలన్నారు. ఈ యేడాది రాష్ట్రం ఆపత్కర పరిస్థితి నుండి బయట పడటం ప్రభుత్వ చొరవవల్ల కాదని అది ప్రకృతి కారణంగానే అన్నారు. రైతులను యూనిట్ గా తీసుకొని పంటన భీమా ఇవ్వాలన్నారు.












Click it and Unblock the Notifications