• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇకపై ఎంఎస్ఎంఈ నిర్వచనం ఇదే.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతులకు గుడ్ న్యూస్

|

కరోనా విజృంభణ,చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థలపై చర్చించేందుకు కేంద్ర కేబినెట్ సోమవారం(జూన్ 1) సమావేశమైంది. మోదీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తయిన సందర్భంలో ఈ సమావేశం జరుగుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజా సమావేశంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా సూక్ష్మ,చిన్న,మధ్య తరహా పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు రెండు ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించింది. ఎంఎస్ఎంఈల ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అభిప్రాయపడింది. కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు.

ఏపీలో తగ్గని కరోనా ఉధృతి: మరిన్ని గడ్డురోజులు: విస్తుపోయేలా పాజిటివ్ కేసుల పెరుగుదల

ఎంఎస్ఎంఈ నిర్వచనం మార్పు..

ఎంఎస్ఎంఈ నిర్వచనం మార్పు..

ఎంఎస్ఈల నిర్వచనాన్ని మార్చేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని ప్రకాష్ జవదేకర్ తెలిపారు. దాని ప్రకారం.. ఇకనుంచి రూ.10కోట్లు పెట్టుబడి,రూ.50కోట్లు ఆదాయం ఉండే వ్యాపారాలను చిన్న తరహా పరిశ్రమలుగా పరిగణిస్తారు. అలాగే ఇకనుంచి రూ.250కోట్లు ఆదాయం ఉండే పరిశ్రమలను మధ్య తరహా పరిశ్రమలుగా పరిగణిస్తారు. గతంలో దీని పరిమితి రూ.100కోట్లుగా ఉండేది. తాజా సవరణల ద్వారా రాబోయే ఏళ్లలో 2లక్షల పరిశ్రమలకు లబ్ది చేకూరుతుందన్నారు. ఎంఎస్ఎంఈలకు అత్యవసర రుణ సదుపాయం కింద రూ.3లక్షల కోట్ల నిధిని ఏర్పాటు చేస్తున్నామని మరో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అత్యవసర క్రెడిట్ లైన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండి MSME మంత్రిత్వ శాఖలో నమోదై ఉండే స్టార్టప్స్‌ అత్యవసర క్రెడిట్‌కు అర్హులు అని దాదాపు రెండు నెలల తర్వాత మొదలైన పరిశ్రమల కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్నాయని.. రాబోయే రోజుల్లో మరిన్ని సడలింపులకు అవకాశమిస్తామని స్పష్టం చేశారు.

ఎంఎస్ఎంఈ ప్యాకేజీ

ఎంఎస్ఎంఈ ప్యాకేజీ

ఎంఎస్ఎంఈలకు రూ.20వేల కోట్లు,రూ.50వేల కోట్ల ప్యాకేజీలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.రూ.20వేల కోట్లు ప్యాకేజీ ద్వారా కుదేలైన ఎంఎస్ఎంఈలకు చేయూతనందిస్తామని,అలాగే రూ.50వేల కోట్ల ప్రతిపాదిత నిధి ఎంఎస్‌ఎంఈ రంగంలో ప్రైవేటు రంగ పెట్టుబడులను ప్రోత్సహిస్తామన్నారు. వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేసే 'పీఎం స్వనిధి' పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. సుమారు 5 మిలియన్ల మంది వీధి వ్యాపారులు దీని ద్వారా లబ్ది పొందుతారని చెప్పారు.

రైతులకు గుడ్ న్యూస్

రైతులకు గుడ్ న్యూస్

కిసాన్ క్రెడిట్ కార్డు కింద రైతులకు ఇచ్చే రుణాలకు సంబంధించిన నిబంధనలను సడలించి రుణ ప్రక్రియను మరింత సులభతరం చేస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.ఎంఎస్ఎంఈలతో పాటు రైతాంగానికి కూడా చేయూత అందించాలని నిర్ణయించామన్నారు. ఖరీఫ్‌లో 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచేందుకు కేబినెట్ ఆమోదించిందన్నారు. ప్రస్తుతం ఉన్న కనీస మద్దతు ధర కంటే రైతులకు 50-83శాతం అధిక మద్దతు ధరను అందిస్తామని చెప్పారు. అలాగే అగస్టు 31 లోపు రుణాలు చెల్లించిన రైతులకు 4శాతం వడ్డీ రేటుకు కొత్త రుణాలు మంజూరు చేయబడుతాయని చెప్పారు

English summary
The Union Cabinet on June 1 approved the setting up of a Rs 50,000 crore fund for MSMEs.The proposed fund of funds will encourage private sector investments in the MSME sector. The actual investments may be even higher.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more