మీకు అదే గతి పడుతుంది - వైసీపీ నేతపై రష్మీ సీరియస్..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయంగా అధికార - విపక్షాలు కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. 2029 ఎన్నికలే టార్గెట్ గా ప్రత్యర్థులను ఫిక్స్ చేసేందు కు ప్రయత్నిస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీ నేత ను యాంకర్ రష్మీ టార్గెట్ చేయటం సంచలనంగా మారుతోంది. వారు చేసిన దానికి భవిష్యత్ లోనూ వారికి ఇదే గతి పడుతుందంటూ తాజాగా యాంకర్ రష్మీ గౌతమ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

వైసీపీ నేత పైన యాంకర్ రష్మీ గౌతమ్ సీరియస్ అయ్యారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత వేళ వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగారు. అందులో భాగంగా తిరుపతి వైసీపీ నేత భూమన అభియన్ రెడ్డి వినూత్న తరహాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. డీజిల్ కొరత కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారంటూ.. ఎడ్ల బండి పైన ఆటో ఎక్కించి నిరసన కొనసాగించారు.

Anchor Rashmi Gautam Slams YSRCP Leader Bhumana Abhinay Reddy Over Alleged Diesel Protest in Tirupati

పార్టీ నేతలతో కలిసి ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఎడ్లబండి పైకి ఎక్కించిన ఆటోలో మనుషులు ఉండటం.. ఎద్దు పైన అంత బరువు ఉంచటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ నిరసన గమనించిన యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. జంతు ప్రేమికురాలైన రష్మీ ఈ ఘటన పైన భూమన అభినయ్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న రష్మీ పోస్టింగ్

రష్మీ చేసిన ట్వీట్ లో... ఆ ఎద్దుల బండి పైకి ఎక్కన వారికి అదే గతి పడుతుందని తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆ ఎద్దు ఆ సమయంలో పడిన వేదన వారికి వెయ్యి రెట్లు జరగాలని రష్మీ వ్యాఖ్యానించారు. పెటా ఇండియా, యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఈ విషయాన్ని పరిశీలించి.. కఠినంగా వ్యవహరించాలని సూచించారు. భవిష్యత్ లో మరెవరూ ఇలా చేయకుండా అవసరమైన ఆంక్షలు అమల్లోకి తీసుకురావాలని కోరారు.

రెండు రోజుల క్రితం 40 హస్కీలను చంపేసారని.. బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. కాగా.. అభినయ్ పార్టీ నిరసనల్లో భాగంగా చేసిన ఈ తరహా నిరసన ఇప్పుడు రష్మీ పోస్టుతో వైరల్ గా మారుతోంది. దీని పైన వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+