అమెరికాలో విషాదం..! ఉద్యోగం రాక కర్నూలు యువకుడి సూసైడ్..!

అమెరికాలో ఇవాళ ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలుకు చెందిన ఇరగనబోయిన చందు అనే యువకుడు (Andhra Youth) అమెరికాకు వెళ్లాడు. అక్కడ చదువు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అదే క్రమంలో ఇక తనకు ఉద్యోగం రాదనే నిర్ధారణకు వచ్చిన అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలే అమెరికాలో భారతీయ విద్యార్ధుల కష్టాలు నానాటికీ పెరుగుతున్నాయనే ఆందోళనల మధ్య ఈ ఘటన జరిగింది.

హైదరాబాద్ లోని సీఎంఆర్ కాలేజీలో బీటెక్ చేసి అమెరికాలోని చికాగోలోని డీపాల్ యూనివర్శిటీలో మాస్టర్స్ చేసేందుకు చందు వెళ్లాడు. గతేడాది డెల్ లో డెవలపర్ గా కూడా అతను కొంతకాలం పనిచేశాడు. ఆ తర్వాత ఉద్యోగం కోల్పోయి మరో ఉద్యోగం కోసం అన్వేషణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న తన తండ్రికి భారంగా మారకూడదనే ఉద్దేశంతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే అతని మృతదేహం భారత్ కు పంపే స్తోమత కూడా లేదు. దీంతో అతని స్నేహితులు అమెరికాలో ఫండ్ రైజింగ్ చేపట్టారు. దీని ద్వారా 1.2 లక్షల డాలర్లు సేకరించారు.

Andhra Youth Dies in US Unemployed Graduate s Tragic End Leaves Family in Grief and Debt

అమెరికా నుండి భారతదేశానికి మృతదేహాన్ని తరలించడానికి అయ్యే ఖర్చు - అంత్యక్రియల సేవలు, చట్టపరమైన అనుమతులు,రవాణాతో సహా సుమారు $25,000 అవుతాయని భావిస్తున్నారు. $25,000 కంటే ఎక్కువ ఉన్న నిధులు, చందు వదిలిపెట్టిన అప్పును తీర్చడంలో సహాయపడటానికి అతని తల్లిదండ్రులకు అందజేయనున్నారు. మరోవైపు చందు శవాన్ని కర్నూలుకు చేర్చేందుకు సాయం చేయాలంటూ ఎక్స్ ద్వారా ఓ యూజర్ ఏపీ మంత్రి నారా లోకేష్‌కు లేఖ రాశారు. ఆ పోస్ట్‌ను గమనించిన లోకేష్, సంతాపం వ్యక్తం చేయడంతో పాటు, మృతదేహాన్ని "సులభంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా తరలించేలా" చూడాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడును కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+