అమెరికాలో ‘తెలుగు’ అందాలు: చిలకలూరిపేట చిన్నది Vs కరీంనగర్ క్వీన్
టెక్సాస్ వేదికగా జరిగిన అందాల సమరంలో తెలుగు అమ్మాయిలు తళుక్కుమన్నారు. సాఫ్ట్‌వేర్ కోడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ మాత్రమే కాదు.. ర్యాంప్ వాక్‌లోనూ తమకు సాటిలేరని నిరూపించారు. అమెరికా వ్యాప్తంగా ఏడు నెలల పాటు సాగిన 'మిస్ తెలుగు యూఎస్ఏ 2026' పోటీల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన అముల్య బల్మూరి విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకుని వార్తల్లో నిలిచారు.
బ్యాంకర్ టు బ్యూటీ క్వీన్: అముల్య అద్భుత ప్రయాణం!
కరీంనగర్ జిల్లా చిట్యాలపల్లికి చెందిన అముల్య, ప్రస్తుతం డల్లాస్‌లో నివసిస్తున్నారు. రిటైర్డ్ ఐ&సీఏడీ అధికారి బీ. శ్రీనివాస్ రావు, రమల దంపతుల కుమార్తె అయిన ఈమె.. కేవలం అందగత్తె మాత్రమే కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి. భోజరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల నుంచి ఐటీలో మాస్టర్స్ పూర్తి చేసి, ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాత గోల్డ్‌మన్ శాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వృత్తిరీత్యా బిజీగా ఉన్నా, ప్రవృత్తిగా రాతను ఇష్టపడే ఆమె కథలకు ఆన్‌లైన్‌లో 90 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉండటం విశేషం.

సినీనటి లయ చేతుల మీదుగా కిరీటం
అమెరికా వ్యాప్తంగా 100 మందికి పైగా సుందరీమణులు పోటీపడగా.. పట్టుదల, నిబద్ధతతో ఫైనల్స్‌కు చేరిన 25 మందిని వెనక్కి నెట్టి అముల్య విజేతగా నిలిచారు. ఏప్రిల్ 4న జరిగిన గ్రాండ్ ఫైనల్‌లో ప్రముఖ సినీనటి లయ ఆమెకు కిరీటాన్ని అలంకరించారు. ఇప్పటికే న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేసి మెప్పించిన 26 ఏళ్ల అముల్య, ఇప్పుడు తెలుగు లోగిళ్ల కీర్తిని అమెరికా వేదికపై చాటి చెప్పారు.
రన్నరప్‌గా చిలకలూరిపేట చిన్నది 'దివ్యశ్రీ'
ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక మెరుపు మెరిసింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లకు చెందిన దివ్యశ్రీ రన్నరప్‌గా నిలిచి ప్రత్యేకత చాటుకున్నారు. అమెరికాలో ఐటీ ఉద్యోగినిగా పనిచేస్తున్న దివ్యశ్రీ.. అందం, వ్యక్తిత్వం మరియు మేధస్సు విభాగాల్లో జడ్జిలను మెప్పించారు. ఈ విజయంతో ఆమె స్వగ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా అమెరికాలో స్థిరపడుతున్న తెలుగు యువత.. ఇప్పుడు ఫ్యాషన్ మరియు గ్లామర్ రంగాల్లోనూ రాణిస్తూ, తమ మూలాలను గౌరవిస్తూ నిర్వహిస్తున్న ఇటువంటి పోటీలు కొత్త తరం అమ్మాయిలకు స్ఫూర్తినిస్తున్నాయి.












Click it and Unblock the Notifications