ఏపీకి రైల్వే మంత్రి భారీ వరాలు, ఇక ఈ రూట్ లో..!!

ఏపీ కేంద్రంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కీలక ప్రకటన చేసారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అమలు పైన ప్రకటన చేసారు. ఏపీకి రెండు బుల్లెట్ రైళ్లను ప్రకటించారు. విశాఖ లో కొత్త రైల్వే జోన్ ఆపరేషన్స్ కోసం అధికారులను నియమించారు. జూన్ 1 నుంచి కొత్త జోన్ కార్య కలాపాలు ప్రారంభం కానున్నాయి. అదే విధంగా మరి కొన్ని ప్రాజెక్టులు.. రైళ్ల కేటాయింపుల పైనా ఏపీ నుంచి వినతుల పైన సానుకూలంగా స్పందించారు.

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ను జూన్ 1 నుంచి అధికారికంగా గుర్తించనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. జోన్ కార్యకలాపాలకు అవసరమైన కీలక అధికారుల నియామకం పూర్తయింది. 3వేల మంది విశాఖ జీఎం కార్యాలయం పరిధిలో పని చేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. జీఎం కార్యాలయంలో 1200 మంది అవసరం, జోన్ అంతటా 17వేల మంది వరకు పనిచేస్తారు. సుమారు 3వేల కిలోమీటర్లతో దాదాపు రాష్ట్రమంతా ఉండేలా కొత్త జోన్ పరిధి ఖరారు చేసారు.

ashwini-vaishnaw-has-stated-that-the-gazette-notification-for-the-creation-of-south-coastal-railway

ఈ జోన్ పరిధిలో మొత్తం రైల్వే రూటు 3,062 కిలోమీటర్లుగా నిర్ధారించారు. రన్నింగ్ ట్రాక్ 5,037 కిలోమీటర్లు ఉండొచ్చని అంచనా. ఖుర్దా డివిజన్లో ఉన్న పలాస- ఇచ్ఛాపురం సెక్షన్‌ను దక్షిణ కోస్తా జోన్‌లోని విశాఖ డివిజన్ పరిధిలోకి మార్చారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస, సుమ్మాదేవి, మందస రోడ్డు, బారువ, సోంపేట, జాడుపూడి, ఇచ్ఛాపురం.. విశాఖ డివిజన్లోకి తీసుకొచ్చారు. కొత్తవలస-కిరండూల్ (కేకే)లైన ను అరకు సెక్షన్ వరకైనా కలపాలని ప్రజల నుండి డిమాండ్ ఉంది.

అమరావతి మీదుగా బుల్లెట్ రైళ్లు

కాగా, ఇదే సమయంలో అమరావతి - హైదరాబాద్‌ మధ్య బుల్లెట్ ట్రైన్‌‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య 70 నిమిషాల్లో, చెన్నై నుంచి అమరావతికి 112 నిమిషాల్లో ప్రయాణం సాధ్యమవుతుందని వివరించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల 08 నిమిషాల్లో ప్రయాణం చేయవచ్చన్నారు. చెన్నై నుంచి కోల్‌కతా మధ్య రైల్వే లైన్లను 4 లేన్లుగా విస్తరించే పనులు చేపడతామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రకటించారు.

ఏపీ నుంచి ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు కొత్తగా వందేభారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపు కోసం వినతి పత్రాలు సమర్పించారు. కాగా.. త్వరలోనే ఏపీకి కొత్తగా వందేభారత్ స్లీపర్ కేటాయింపు పైన నిర్ణయం ఉంటుందనే సంకేతాలు అందుతున్నాయి. అదే విధంగా త్వరలో ప్రారంభం కానున్న ముంబాయి - బెంగళూరు వందేభారత్ స్లీపర్ ఏపీ మీదుగా రూట్ ఖరారు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+