ఏపీ నుంచి రాజ్యసభకు బీజేపీ అభ్యర్దిగా.. మోదీ మార్క్ నిర్ణయం - కేంద్ర మంత్రిగానూ..!?

ఏపీ కేంద్రంగా బీజేపీ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏపీ ప్రభుత్వంలో భాగస్వామి గా ఉన్న బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఏపీలో పదవుల కంటే.. రాజ్యసభ అభ్యర్థిత్వాల విషయంలో క్లియర్ గా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా ఏపీ నుంచి ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో తమకు దక్కే సీటు పైన ఒక నిర్ణయానికి వచ్చింది. తమ పార్టీ నుంచి అభ్యర్ధిని ఖరారు చేసింది. ఇప్పటికే ఈ మేరకు భాగస్వామ్య పక్షాలకు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం.

ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నెల 21 లేదా 22 తేదీల్లో రాజ్యసభ ఖాళీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలోనే అటు కేంద్రం కేబినెట్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఏపీ నుంచి ఖాళీ కానున్న నాలుగు స్థానాల్లో రెండు టీడీపీకి .. బీజేపీ - జనసేన చెరో స్థానం దక్కించుకునేలా ప్రాధమికంగా చర్చలు జరిగాయి. బీజేపీ అభ్యర్దిగా ఏపీ కోటాలో రాజ్యసభకు ఎవరిని పంపాలో ఇప్పటికే మోదీ - షా ద్వయం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సీటు కోసం బీజేపీ నుంచి పలువురు నేత లు తమ వంతు ప్రయత్నాలు చేసారు. వారిలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, జీవీఎల్ నరసింహా రావు తో పాటుగా గతంలోనే రాజ్యసభకు ఎంపిక చేస్తారనే ప్రచారం జరిగిన మంద కృష్ణమాదిగ పేరు తిరిగి రేసులోకి వచ్చింది. అయితే, అనూహ్యంగా తమిళనాడు బీజేపీ నేత అన్నామలై పేరు ను ఏపీ నుంచి ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

ఉచిత బస్సు పథకం అమలు వేళ కొత్త కష్టాలు...!!
ఉచిత బస్సు పథకం అమలు వేళ కొత్త కష్టాలు...!!
bjp-chances-to-field-annamalai-for-rajyasabha-form-andhra-pradesh-as-latest-discussions

ఏపీ కేంద్రంగా బీజేపీ నిర్ణయాలు

తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన అన్నామలై తాజాగా జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో పోటీకి దూరంగా నిలిచారు. తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు... అన్నా డీఎంకే చీలిక తో భవిష్యత్ రాజకీయాలకు తమిళనాడులో అన్నామలై పాత్ర కీలకంగా మారనుంది. దీంతో.. ఏపీ నుంచి రాజ్యసభకు పంపి.. కేంద్రంలో మంత్రిగా అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పట్టు పెంచుకునే వ్యూహాలు అమలు చేస్తున్న వేళ... మోదీ- షా ద్వయం సైతం
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దక్షిణాదిన పార్టీకి బలమైన వాయిస్ గా ఉన్న అన్నామలైను కేంద్రంలో మంత్రిగా చేయటం ద్వారా కొత్త ప్రణాళికల అమలుకు బీజేపీ సిద్దం అవుతోంది. దీంతో, చివరి నిమిషంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటే మినహా అన్నామలై ఏపీ నుంచి రాజ్య సభకు ఎంపిక కావటం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+