ద్రోణి ప్రభావం, ఏపీలో మూడు రోజులు ఈ జిల్లాలో వర్షాలు...!!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఠారెత్తిస్తున్న ఎండలు.. మరో వైపు అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో నమోదు అవుతున్నాయి. ఇదే సమయంలో రానున్న మూడు రోజులు ఏపీ, తెలంగాణ లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో వారం పాటు ఎండల తీవ్రత ఇదే స్థాయిలో కొనసాగుతుందని అంచనా వేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ప్రజలు అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేఫథ్యంలో ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడు రోజులు ఆంధ్ర ప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ద్రోణి/ గాలులు అంతరాయం ఈరోజు దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 50 - 60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

మూడు రోజులు వర్షాలు
కాగా, శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40 - 50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. రాయలసీమ ప్రాంతంలో గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40 - 50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని వెల్లడించారు. తెలంగాణలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications