టీడీపీ ఎమ్మెల్యే సమక్షంలోనే అనుచరుల వీరంగం, దాడి - చంద్రబాబు కీలక ఆదేశాలు..!!
టోల్‌గేట్ సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచరులు, ఎస్కార్ట్ పోలీసులు దాడికి దిగారు. విచక్షణారహితం గా కొట్టారు. ఇదంతా ఆ ఎమ్మెల్యే సమక్షం లోనే జరిగినా ఆయన చోద్యం చూస్తూ కారులోనే కూర్చొ న్నారు. ఎమ్మెల్యే వాహనం ఆపుతారా అంటూ వీరంగా చేసారు. అయినా.. ఎమ్మెల్యే వారించేందుకు ప్రయత్నించలేదు. ఈ దాడి ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా.. ఈ పరిణామాల పైన సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కీలక ఆదేశాలు ఇచ్చారు.
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల నుంచి వస్తున్నారు. ఆయన వాహనాన్ని అన్నమయ్య జిల్లా లోని వాల్మీకిపురం- కలికిరి మార్గ మధ్యంలోని టోల్‌గేట్ వద్ద సిబ్బంది ఆపారు. అక్కడ కొద్ది క్షణాలు ఆలస్యమయ్యే సరికి ఎమ్మెల్యే వాహనం వెంబడి ఉన్న ఎస్కా ర్ట్ పోలీసులు, అనుచరులు దూసుకొచ్చి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో టోల్‌గేట్ సిబ్బందికి దెబ్బలు తగిలాయి. వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కరు ఉన్నా ఎందుకు నిలుపుతారంటూ దుర్భాషలాడారు. టోల్‌గేట్ చెక్‌పోస్టు బారికేడ్లను ధ్వంసం చేశారు. టోల్‌గేట్ సిబ్బందిని ఈడ్చుకుంటూ తమ వాహనంలో వాల్మీకిపురం పోలీస్ స్టేషన్‌కు.. తీసుకెళ్లారు. ఈ తతంగమంతా ఎమ్మెల్యే కారులో కూర్చొని చూస్తూ ఉండిపోయారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరా లు రికార్డు కావడం, సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అయ్యాయి.

చంద్రబాబు కీలక ఆదేశాలు
పోలీస్ స్టేషన్‌క లో 2గంటల పాటు నడిచిన పంచాయితీలో ఇరువర్గాలు మళ్లీ వాగ్వాదానికి దిగాయి. ఇరు వర్గాలను సీఐ రాఘవరెడ్డి విచారించి, టోల్‌గేట్ సిబ్బందిని మందలించి పంపేశారు. ఈ వ్యవహారమంతా సాయంత్రానికిమరోసారి సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అయింది. కాగా, టోల్‌గేట్ సిబ్బందిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరుల దాడిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. టోల్‌గేట్ సిబ్బందిపై దాడికి దిగిన సురేంద్రబాబు అనుచరులపై కేసులు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె-తిరుపతి రహదారిపై గండబోయినపల్లె వద్ద టోల్‌గేట్ సిబ్బందితో నిన్న ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరుల వాగ్వాదం, దాడికి పాల్పడ్డారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications