కొరత ఎఫెక్ట్- మార్కాపురంలో ఏ వాహనానికి ఎంత పెట్రోల్, డీజిల్ పోస్తారంటే ?
ఏపీలో ఎక్కడ చూసినా పెట్రోల్, డీజిల్ కొరత (Fuel Crisis)వేధిస్తోంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ చమురు కొరత కనిస్తోంది. చమురు కంపెనీలు నిబంధనలు మార్చడం, ప్రభుత్వం దీనిపై అప్రమత్తంగా లేకపోవడంతో సమస్యలు తలెత్తాయి. దీంతో నిన్నటి నుంచి సీఎం చంద్రబాబు .. ఆయిల్ కంపెనీలు, అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ మేరకు ఇవాళ సాయంత్రం కల్లా పరిస్ధితి అదుపులోకి వస్తుందని చెప్తున్నారు. అయినా జిల్లాల్లో మాత్రం పరిస్ధితులు మారడం లేదు.
ఈ నేపథ్యంలో మార్కాపురం జిల్లా (Markapuram District) పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పెట్రోల్ బంకుల్లో ఏ వాహనానికి ఎంతెంత పెట్రోల్, డీజిల్ (petro, diesel) పోయాలో పరిమితులు నిర్ణయించారు. పెట్రోల్ బంకులు నిర్ణయించిన పరిమితి మేరకే వాహనాలకు చమురు విక్రయించాలని, అలాగే క్యాన్లలో అమ్మకాలు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పెట్రోల్ బంకుల యజమానులు కూడా బైక్ లు, కార్లు, లారీలు, భారీ వాహనాలకు వేర్వేరుగా పోలీసులు ఇచ్చిన లిమిట్ మేరకు అమ్మకాలు సాగిస్తున్నారు.

మార్కాపురం పోలీసులు బంకులకు నిర్ణయించిన లిమిట్స్ ప్రకారం బైక్ కు కేవలం 2 లీటర్లు పెట్రోల్, కారుకు 15 లీటర్లు పెట్రోల్ లేదా డీజిల్, లారీకి 50 లీటర్లు డీజిల్, భారీ వాహనాలకు 100 లీటర్ల డీజిల్ మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. ఈ పరిమితికి మంచి ఎక్కడైనా పోస్తున్నట్లు గుర్తిస్తే పోలీసులు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. అలాగే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ అక్రమంగా నిల్వచేసినా చర్యలు తీసుకుంటామని మార్కాపురం ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications