పొత్తు వద్దు విలీనమే..! విజయ్ కు సాయిరెడ్డి షాకింగ్ సలహా..!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న టీవీకే అధినేత విజయ్ కు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఇవాళ కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం అవసరమైన మెజార్టీ లేకపోవడంతో టీవీకే ఇప్పుడు కాంగ్రెస్ తో పాటు మరికొన్ని చిన్న పార్టీలవైపు చూస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ టీవీకేకు మద్దతు ప్రకటించింది. దీనికి కొనసాగింపుగా చిన్న పార్టీలు సైతం అదే బాటలో ఉన్నాయి.
ఇలాంటి సమయంలో టీవీకే అధినేత విజయ్ ను ఉద్దేశించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఇందులో సాయిరెడ్డి.. విజయ్ సాధించిన విజయ తమిళనాడు ప్రజల ఆకాంక్షలను ఆకట్టుకోవడం, ద్రవిడ పార్టీల పట్ల ఉన్న విసుగును అధిగమించడం, యువ ఓటర్లతో మమేకమవడం, తన స్టార్ పవర్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వల్ల సాధ్యమైందన్నారు. ఇక ముందు ఆయనకు రెండు సూచనలు చేస్తున్నట్లు సాయిరెడ్డి తెలిపారు.

Thiru #Vijay’s win comes from capturing the expectations/imagination of the people of #TamilNadu, breaking away from Dravidian party fatigue, connecting with young voters, and effectively using his star power. I have 2 suggestions for him going forward :
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 5, 2026
1. Build an experienced…
Instead of entering into alliances with smaller regional political parties, Thiru Vijay should invite them to merge with TVK and work towards forming a stable majority government in #TamilNadu. The people of Tamil Nadu have historically benefited from governments with a clear…
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 6, 2026
ఇందులో మొదటిది ఈ ఊపును పరిపాలనగా మార్చగల అనుభవజ్ఞులైన, సమర్థులైన బృందాన్ని నిర్మించుకోవాలన్నారు. అలాగే తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సహాయపడగల పార్టీతో మాత్రమే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని సాయిరెడ్డి సూచించారు. చిన్న ప్రాంతీయ రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడానికి బదులుగా .. విజయ్ వారిని టీవీకే (TVK)లో విలీనం కావాలని ఆహ్వానించి, తమిళనాడులో స్థిరమైన మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కృషి చేయాలన్నారు. స్పష్టమైన ప్రజా తీర్పు, రాజకీయ స్థిరత్వం ఉన్న ప్రభుత్వాల వల్ల తమిళనాడు ప్రజలు చారిత్రాత్మకంగా లబ్ధి పొందారని సాయిరెడ్డి గుర్తుచేశారు.














Click it and Unblock the Notifications