పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు- భారీగా క్యూ లైన్లు..!!
ఏపీలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం తీవ్ర ఇంధన సంక్షోభానికి దారితీస్తోంది. కొరత రోజురోజుకీ పెరిగిపోతోంది. మెజారిటీ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టడం వాహనదారులను ఆందోళనకు గురిచేసింది. దీంతో పనులన్నీ వదులకుని పెట్రోల్, డీజిల్ కోసం క్యూ కట్టారు వాహనదారులు.. పలు జిల్లాలో చాలాచోట్ల పెట్రోల్ బంక్‌లు బంద్ అయ్యాయి. దీంతో, పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూలు కట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత రోజురోజుకీ పెరిగిపోతోంది. కొన్ని జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టడం వాహనదారులను ఆందోళనకు గురిచేసింది. పెట్రోల్, డీజిల్ కోసం క్యూ కట్టారు వాహనదారులు. గోదావరి జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులను ఇబ్బంది పెడుతోంది. వరికోతలు, ఆక్వా చెరువుల నిర్వహణపై డీజిల్ కొరత ఎఫెక్ట్ పడుతోంది. రాజమండ్రిలోని పలు పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. బంకుల ముందు తెల్లవారుజాము నుంచే వాహనదారుల పడిగాపులు కాశారు. గుంటూరు లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చాలావరకు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. మరికొన్ని బంకుల్లో టూ వీలర్‌కి 500 రూపాయలు... ఫోర్ వీలర్‌కి వెయ్యి రూపాయల పెట్రోల్, డీజిల్ మాత్రమే కొడుతున్నారు.

ప్రభుత్వం ఆరా.. అధికారులకు ఆదేశాలు
కాగా, కర్నూలు, నంద్యాలతో పాటు పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బారులు తీరారు. ఇక.. నో స్టాక్ బోర్డులతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిజంగా కొరత ఉందా లేదా బ్లాక్ మార్కట్‌కు తరలిస్తున్నారా అని విచారణ జరుపుతున్నారు. కృత్తిమ కొరత సృష్టిస్తే కఠినచర్యలు తప్పవని ఆయా జిల్లాల కలెక్టర్లు హెచ్చరిస్తున్నారు. అయితే పెట్రోల్, డీజిల్ కొరత ఉన్న మాట వాస్తవమే అంటున్నారు బంకుల యజమానులు. ఇరాన్-అమెరికా యుద్ధానికి ముందు పెట్రోల్, డీజిల్ సరఫరా కంపెనీలు డీలర్లకు అప్పుగా పెట్రోల్, డీజిల్ సప్లయ్ చేసేవని.. ఇప్పుడు క్రెడిట్ నిలిపివేయటంతోనే కొరత ఏర్పడుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం పై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్టులపై చర్చించారు. సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని.. సీఎస్, పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications