మహానాడు వేదికగా.. మారిన నిర్ణయం, బిగ్ స్కెచ్..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మహానాడు వేదిక పైన నిర్ణయం ప్రకటించారు. తొలుత ఈ సారి మహానాడు ను ఉత్తరాంధ్రలో నిర్వహించాలని భావించారు. కాగా, తాజాగా పార్టీలో చర్చల తరువాత మహానాడు వేదికను ఖరారు చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల పైన కసరత్తు జరుగుతున్న వేళ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో పార్టీ.. ప్రభుత్వ పరంగా కొత్త నిర్ణయాలకు చంద్రబాబు సిద్దం అవుతున్నారు.
టీడీపీ ఈ ఏడాది మహానాడు పైన సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. తొలుత మహానాడు సభను ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాలని భావించినప్పటికీ, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వేదికను నెల్లూరు జిల్లాకు మారుస్తూ నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరియు ఎన్టీఆర్ జయంతి (మే 28) పురస్కరించుకుని ఈ మెగా ఈవెంట్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలుత విజయనగరం లో నిర్వహించాలని నిర్ణయించినా.. వేదిక మార్పుకు ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఒక కారణంగా కనిపిస్తోంది. జూన్ లేదా జూలై నెలల్లో ప్రధాని మోదీ ఉత్తరాంధ్రలో భారీ బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకే ప్రాంతంలో తక్కువ వ్యవధిలో రెండు భారీ రాజకీయ సభలు నిర్వహించడం కంటే, వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించటం ద్వారా ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

నెల్లూరు వేదికగా మహానాడు
ఈ నిర్ణయం వెనుక టీడీపీ వ్యూహాత్మక ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అదే విధంగా 2024 ఎన్నికల్లో కూటమి జిల్లాలోని మొత్తం అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. దక్షిణ కోస్తాలో పార్టీ కేడర్‌ను స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సిద్ధం చేయడానికి ఈ వేదికను వాడుకోవాలని అధిష్టానం భావిస్తోంది. ప్రస్తుత పరిణామాల ప్రకారం, నెల్లూరులోని అనువైన ప్రదేశాలను పార్టీ ముఖ్య నేతలు ఇప్పటికే పరిశీలిస్తున్నారు. లక్షలాదిగా వచ్చే కార్యకర్తలు మరియు నాయకులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మైదానాలు, రవాణా సౌకర్యాలను జిల్లా నేతలు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాల వారీగా 'మినీ మహానాడు'లు నిర్వహించి, చివరగా నెల్లూరులో జరిగే ప్రధాన మహానాడుతో పార్టీ శ్రేణుల్లో పూర్తిస్థాయిలో జోష్ నింపే విధంగా కార్యాచరణ ఖరారు చేస్తున్నారు.













Click it and Unblock the Notifications