జ‌గ‌న్‌ను ఆశీర్వ‌దించిన అర్చ‌కుల‌కు TTD బిగ్ షాక్..!!

ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార - విపక్షాల మధ్య రాజకీయ పోరు తీవ్ర స్థాయికి చేరింది. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇటు జగన్ సైతం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ సమయంలోనే మరో ఆసక్తి పరిణామం చోటు చేసుకుంది. జగన్ పులివెందుల పర్యటన వేళ ఒంటిమిట్ట రామాలయం కు చెందిన అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. దీని పైన టీటీడీ సీరియస్ అయింది. అర్చకుల కు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఈ వ్యవహారం చర్చగా మారుతోంది.

మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. మరో రెండు రోజుల్లో జగన్ కుటుంబంతో సహా యూరప్, లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీబీఐ కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. మే 15వ తేదీ వరకు జగన్ పర్యటన కొనసాగనుంది. కాగా.. జగన్ పులివెందుల పర్యటనలో భాగంగా టీటీడీ అర్చకులు వేద అశీర్వచనం ఇచ్చారు. వీరికి టీటీడీ సంజాయిషీ కోరుతూ షో కాజ్ నోటీసులు జారీ చేసారు. ఒంటిమిట్ట కోదండరామాలయ అర్చుకులు శ్రావణ్ కుమార్, వీణా మనోజ్ కుమార్, రాజంపేట మండలం బోయినపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయ సిబ్బంది పులివెందులలో మాజీ సీఎం జగన్ నివాసానికి వెళ్లారు.

ttd-officials-issue-notices-to-priests-who-blessed-ys-jagan-in-pulivenudla-citing-lack-of-prior-perm

రెండో రోజుల్లో సమాధానం కోరుతూ నోటీసులు జారీ

టీటీడీ పరిపాలన అధికారుల నుంచి ముందస్తుగా ఎలాంటి అనుమతి తీసుకోకుండా అత్యుత్సా హం ప్రదర్శించారని టీటీడీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసారు. వారంతా మాజీ సీఎం జగన్ కు శేషవస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలను అందచేసి వేద ఆశీర్వచనం చేసారు. ఈ విషయాన్ని టీటీడీ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ సేవలో తరించారంటూ ఈ ముగ్గురు అర్చకులకు ఉప కార్యనిర్వహణాధికారి ప్రశాంతి తాజాగా నోటీసులు జారీ చేసారు. రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసారు. సకాలంలో స్పందించక పోయినా.. ఇచ్చిన సమాధానం సరిగ్గా లేకపోయినా.. క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అందు లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+