తిరుమలలో రద్దీ వేళ భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, దర్శనం..వసతి ఇలా సులభంగా పొందండి..!!
TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శనివారం కావడంతో భక్తుల రద్దీ అత్యంత ఎక్కువగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్ క్రిష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుంది. రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. కాగా.. ఆగస్టు నెలలో శ్రీవారి ఆర్జిత సేవలు.. దర్శన టోకెన్ల కోటా విడుదల పై టీటీడీ కీలక అంశాలను వెల్లడించింది.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళా పాదపధ్మారాధన ఆగస్టు నెల కోటాను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఉదయం 10 గంటల కు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. లాటరీలో ఎంపికైన భక్తులు ఈ నెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం లోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి. 21న ఉదయం 11గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు విడుదల చేస్తారు. వర్య్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా మధ్యాహ్నం 3 గంటలకు విడుదల అవుతుంది.

ఆగస్టు నెల కోటా విడుదల
అదే విధంగా 23వ తేదీన ఉదయం 10 గంటలకు అంగప్రదిక్షణ కోటా, 11 గంటలకు శ్రీవాణీ ట్రస్టు బ్రేక్ దర్శన కోటా అందుబాటులో ఉంచుతారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజెన్స్, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా విడుదల చేయనున్నారు. ఇక.. 25న ఉదయం 11 గంటలకు ప్రత్యక ప్రవేశ దర్శనం రూ 300 టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు అద్దె గదుల బుకింగ్ కోటా విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanamas.ap.gov.in/ ద్వారా సేవా టికెట్లను బుక్ చేసు కోవాలని టీటీడీ భక్తులకు సూచించింది. ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ పరిమితంగా అనుమతిస్తోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా నిర్ణయాలు ఉంటాయని టీటీడీ స్పష్టం చేసింది.













Click it and Unblock the Notifications