విమానమెక్కిన టాపర్లు! ఎమ్మెల్యే ఇచ్చిన స్పెషల్ ట్రీట్ ఇదే!

సామాన్యుడి బిడ్డకు విమాన ప్రయాణం అనేది ఒక తీరని కల. కానీ, పట్టుదలతో చదివి పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆ కలను నిజం చేసి చూపించారు నందిగామ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీమతి తంగిరాల సౌమ్య. 'కలలకు రెక్కలు' అనే వినూత్న కార్యక్రమం ద్వారా నియోజకవర్గ టాపర్లను ఆమె స్వయంగా విమానంలో హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు.

పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులను ఎంపిక చేసి, వారిని ప్రోత్సహించేందుకు ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవారం ఉదయం విద్యార్థులతో కలిసి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఎమ్మెల్యే, అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసి వారితో కలిసి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. కేవలం బస్సు, రైలు ప్రయాణాలకే పరిమితమైన పేద విద్యార్థులు, మొదటిసారి విమానమెక్కినప్పుడు వారి ముఖాల్లో కనిపించిన ఆశ్చర్యం, సంతోషం అక్కడి వారిని కదిలించాయి.

Wings of Dreams MLA Tangirala Soumya Takes Nandigama SSC Toppers on a Special Flight Trip to Hyderabad

ప్రతిభకు పట్టం.. వీరే ఆ విజేతలు!

ఈ విమాన ప్రయాణం చేసిన విద్యార్థులందరూ బడుగు, బలహీన వర్గాలకు చెందినవారు. కూలీ పనులు చేసుకునే తల్లిదండ్రుల బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అద్భుత మార్కులు సాధించడం విశేషం.

  • షేక్ అర్షియా నాజ్ (మొగులూరు): 589 మార్కులు
  • ప్రజాపతి పర్వీన్ (లింగాలపాడు): 576 మార్కులు
  • వీరులపాడు మండలం విద్యార్థి: 571 మార్కులు
  • పల్లె పోగు వినీల (ముప్పాళ్ల గురుకులం): 567 మార్కులు
  • నారిశెట్టి జగదీష్ ఆదిత్య (చందర్లపాడు): 559 మార్కులు
  • ఉప్పులూరి సోనీ ప్రియా (అనాసాగరం): 549 మార్కులు

విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారధ్యంలో ఏపీ విద్యా రంగం పురోభివృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. గత ఏడాది కంటే రాష్ట్రవ్యాప్తంగా ఫలితాలు మెరుగుపడటమే కాకుండా, నందిగామ నియోజకవర్గంలో ఉత్తీర్ణత శాతం 74.80 నుండి 80.08కి పెరగడం గర్వకారణమని ఆమె అన్నారు. ఉపాధ్యాయులను సింగపూర్ పర్యటనలకు పంపడం, విద్యార్థులకు ఇలాంటి ప్రోత్సాహకాలు అందించడం వల్ల ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతుందని ఆమె వెల్లడించారు.

గురువులు, తల్లిదండ్రుల కృషితోనే విజయం

పేదరికంలోనూ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రుల కష్టం, వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువుల మార్గదర్శకత్వం ఈ విజయంలో కీలకమని సౌమ్య కొనియాడారు. ఈ ప్రయాణం కేవలం గన్నవరం నుండి హైదరాబాద్ వరకు మాత్రమే కాదని, ఇది వారి ఉన్నత భవిష్యత్తుకు నాంది కావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, కూటమి నాయకులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+