జగన్ - విజయ్ కీలక మంత్రాంగం, మారుతున్న లెక్కలు..!!

ఏపీ రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. తమిళనాడులో విజయ్ గెలుపు తరువాత కాంగ్రెస్ దక్షిణాది రాష్ట్రాల పై ఆశలు మరింత పెరిగాయి. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కేరళలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. తమిళనాడులో విజయ్ ప్రభుత్వం లో కీలక భాగస్వామిగా ఉంది. కాగా, బీజేపీ సైతం ఆపరేషన్ సౌత్ ప్రారంభించింది. ఈ సమయం లో దక్షిణాదిన జగన్, కేసీఆర్, విజయ్ కీలకంగా మారుతున్నారు. తాజాగా విజయ్- జగన్ మధ్య మంత్రాంగం తో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.

తమిళనాడులో విజయ్ అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ తో సహా మరో నాలుగు పార్టీల మద్దతు తో ప్రభుత్వం ఏర్పాటు చేసారు. అన్నా డీఎంకే చీలిక వర్గం మద్దతుతో అసెంబ్లీలో విజయ్ బలం 144 కు చేరింది. ఇక.. విజయ్ ఎన్నికల ప్రచారంలో జగన్ ఫొటో చూపించటం.. సింగిల్ గా పోటీ చేసి గెలవటం..అంతకు ముందు ఒక వివాహ వేడుకలో జగన్- విజయ్ కలవటంతో.. వైసీపీ కేడర్ జగన్ తో పాటుగా విజయ్ పైనా అభిమానం చూపిస్తున్నారు. ఈ సమయంలోనే విదేశీ పర్యటన నుంచి వచ్చిన జగన్ తాజాగా తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విజయ్‌ సమర్థవంత మైన, పారదర్శకమైన ప్రజాపాలన అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. తమిళనాడు ప్రజలు విజయ్‌ నాయకత్వంపై ఎంతో విశ్వాసం ఉంచారని పేర్కొన్న ఆయన, ఆ విశ్వాసాన్ని నిలబెట్టు కుంటూ ప్రజల ఆశయాలను నెరవేర్చాలని కోరుకున్నారు.

జగన్ మాస్టర్ స్కెచ్, మంగళగిరి బరిలో కొత్త నేత - ఆ నియోజకవర్గాల్లోనూ..!!
జగన్ మాస్టర్ స్కెచ్, మంగళగిరి బరిలో కొత్త నేత - ఆ నియోజకవర్గాల్లోనూ..!!
ys-jagan-wished-vijay-on-his-big-victory-says-people-of-tamil-nadu-had-placed-strong-faith-in-vija

విజయ్ - జగన్ మంత్రాంగం వెనుక

రాష్ట్రాన్ని అభివృద్ధి, సమగ్ర పాలన, ప్రజా సంక్షేమం దిశగా ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు. అలాగే విజయ్‌ నాయకత్వంలో తమిళనాడు దేశ అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించాలని, భారత సమగ్ర ప్రగతికి బలమైన భాగస్వామిగా నిలవాలని జగన్‌ ఆకాంక్షించారు. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య సుదీర్ఘంగా సంభాషణ జరిగినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయాలతో ఈ ఇద్దరి నిర్ణయాలు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే, త్వరలోనే వీరిద్దరి భేటీ ఉంటుందని తెలుస్తోంది. రాజకీయంగా కాంగ్రెస్ తో విజయ్ కలవటం.. ఇటు ఎన్డీఏ కూటమిలో లేకపోయినా జగన్ అవసరమైన సమయంలో కేంద్రాని కి మద్దతుగా నిలుస్తుండటంతో.. ఈ ఇద్దరి భవిష్యత్ నిర్ణయాలు ఆసక్తి గా మారే అవకాశం ఉంది. అయితే, దక్షిణాది రాష్ట్రాలే లక్ష్యంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ - బీజేపీ రాజకీయ వ్యూహాలు కొత్త సమీకరణాలకు తెర తీయనున్నాయి. ఈ సమయంలో జగన్ - విజయ్ మైత్రి ఎలాంటి నిర్ణయాల క కారణంగా నిలుస్తుందనే రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+