పేలిన సిలిండర్ల ధరలు: ఏకంగా రూ.993 పెంపు

Commercial LPG Cylinder Price: వంటగ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు పెరిగాయి. ఒక్కో సిలిండర్‌పై ఏకంగా 993 రూపాయలు పెరిగింది. పెరిగిన రేట్లు ఈ తెల్లవారు జాము నంచి అమలులోకి వచ్చాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన రెండో రోజే వంటగ్యాస్ సిలిండర్ల రేట్లు అమాంతం దాదాపు రూ. 1,000 వరకు పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి. ఢిల్లీలో 993 రూపాయల మేర పెరిగింది. ఇతర నగరాల్లో దీని ధర 1,000 రూపాయల వరకు పెరిగింది. ఈ పెంపు హోటళ్లు, రెస్టారెంట్లను నడిపే వారిలో ఆందోళన నింపింది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల (Domestic LPG Cylinder) ధరలు స్థిరంగా ఉండటంతో సామాన్యులకు కొంత వరకు ఊరట లభించింది.

19 KG Commercial LPG Gas Cylinder Prices has been Hiked by Rs 993 From today by Oil Marketing Companiess

ఈ పెంపుతో ఢిల్లీలో నిన్నటివరకు 2,078.50 ఉన్న కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ ధర ఎకాఎకిన రూ. 3,071.50 రూపాయలకు చేరింది. ముంబై, కోల్‌కతా నగరాల్లోనూ ధరలు గణనీయంగా పెరిగాయి. కోల్‌కతాలో 994 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతం కోల్‌కతాలో సిలిండర్ ధర రూ. 2,208 నుండి రూ. 3,202కి చేరుకుంది. ఇదే మాదిరిగా ముంబైలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 3,024 కు చేరుకుంది. గతంలో ఇది రూ. 2,031కి లభించేది. చెన్నైలో వాణిజ్య సిలిండర్ ధర 3,237కి చేరింది. ఇదే అత్యధికం. ఇక్కడి పాత ధర రూ. 2,246.50గా ఉండేది.

గృహ వినియోగం కోసం ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్ రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఇండియన్ ఆయిల్ ప్రకారం.. ఢిల్లీ- రూ. 853.00, గుర్గావ్- రూ. 861.5, అహ్మదాబాద్- రూ. 860, జైపూర్- రూ. 856.5, పాట్నా- రూ. 942.5, ఆగ్రా- రూ. 865.5, మీరట్- రూ. 860, ఘజియాబాద్- రూ. 850.5, ఇండోర్- రూ. 881, భోపాల్- రూ. 858.5, లూధియానా- రూ. 880, వారణాసి- రూ. 916.50 పైసలు, లక్నో-రూ. 890.50 పైసలు, ముంబై- రూ. 852.50 పైసలు, పూణే- రూ. 856, హైదరాబాద్- రూ. 905, బెంగళూరు 855.50 పైసలు ఉంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+