దెబ్బ అదుర్స్ కదూ: రియల్ జన నాయగన్

తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతోంది. 210కు పైగా స్థానాల నుంచి అందిన తాజా ట్రెండ్స్ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్‌ తర్వాత, ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రస్తుతం వేగంగా సాగుతోంది. ప్రారంభం విజయ్ స్థాపించిన తమిళన వెట్రి కజగం పార్టీ దూకుడు కనిపించింది. దీర్ఘకాలంగా తమిళనాట పాతుకుపోయిన రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే పార్టీ అధికారాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. ఏఐఏడీఎంకేదీ అదే పరిస్థితి.

ఈ ఎన్నికల్లో అతి పెద్ద సంచలనం.. టీవీకే అద్భుతమైన ప్రదర్శన కనపర్చడం. ఈ ఎన్నికలతోనే అరంగేట్రం చేసిన టీవీకే 100 కు పైగా స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. ఏఐఏడీఎంకే రెండు, డీఎంకే మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక్కడ హంగ్ తప్పకపోవచ్చు. ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 సీట్ల మెజారిటీ వచ్చే అవకాశాలు ప్రస్తుతానికి లేనట్టే. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది టీవీకే. ఇంకా కౌంటింగ్ కొనసాగుతోండటంతో సీట్ల సంఖ్య మరింత పెరగొచ్చు.

Jana Nayagan Movie Not Yet Released But Vijay Poised Real Jana Nayagan Emerges as TVK Largest Party

ఈ ట్రెండ్స్ తమిళనాడు రాజకీయ సమీకరణాలను నాటకీయంగా మార్చివేస్తున్నాయి. విజయ్ స్వతహాగా కింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పార్టీ చూపిన అనూహ్య ప్రభంజనం, ఇతర పార్టీల మద్దతుతో కలిసి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించగలరు. బీజేపీకి దూరంగా ఉంటూ వస్తోన్నందున విజయ్.. డీఎంకే వైపే మొగ్గు చూపే అవకాశాలు కొట్టిపారేయట్లేదెవరూ. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలే ఆయనకు మెజారిటీ సీట్లను అందించాయనేది సుస్పష్టం.

ఈ విజయంతో విజయ్ రియ.. ల్ జన నాయకుడు అయ్యాడు. ఆయన నటించిన జన నాయగన్ సినిమా ఇప్పటికీ విడుదల కావట్లేదు. విజయ్ చివరి సినిమా ఇది. హెచ్ వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'జన నాయగన్' ఎప్పుడో ఈ ఏడాది సంక్రాంతిని పురస్కరించుకుని జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అప్పుడప్పుడే తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోండటం, ఈ మూవీలో పొలిటికల్ పంచ్ డైలాగ్స్ ఉండటం వంటి కారణాలతో సెన్సార్ వివాదంలో చిక్కుకుంది.

సీబీఎఫ్‌సీ పలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సినిమా క్లియరెన్స్ ఆలస్యమైంది అప్పట్లో. సినిమా నిర్మాతలు, సీబీఎఫ్‌సీ మధ్య జరిగిన న్యాయ పోరాటానికి దిగారు. ఆ తర్వాత ఆ విషయాన్ని దాదాపుగా అందరూ మర్చిపోయారు. విజయ్ కూడా ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. అదే సమయంలో ఈ మూవీ హెచ్ డీ ప్రింట్ లీక్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయ్ కు అనుకూలంగా ఉండటం వల్ల దీన్ని ఆ పార్టీ నాయకులే లీక్ చేశారనే ప్రచారం జరిగింది కూడా.

వీటన్నింటినీ దాటుకుని ఎన్నికల క్షేత్రంలో విజయ్ రియల్ జన నాయకుడు అయ్యాడు. తమిళనాడులో పాతుకుపోయిన ద్రవిడ పార్టీల పునాదులను పెకిలించినట్టయిందీ గెలుపుతో. అటు అధికార డీఎంకే, ఇటు ప్రతిపక్ష ఏఐఏడీఎంకేలకు ఏకకాలంలో షాక్ ఇచ్చాడు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈ రెండింట్లో ఏదో ఒక పార్టీ తనతో బేరసారాలు సాగించాల్సిన పరిస్థితిని కల్పించాడు విజయ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+