Kerala Election Results 2026: కేరళ తీర్పు క్లియర్-యూడీఎఫ్ చేతిలో ఎల్డీఎఫ్ చిత్తు..!

కేరళ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓటర్ల తీర్పుపై (Kerala Election results 2026) క్లారిటీ వచ్చేసింది. ఇవాళ జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఆరంభం నుంచీ ఆధిక్యం ప్రదర్శిస్తున్న విపక్ష యూడీఎఫ్ కూటమి.. ఇప్పటికే మెజార్టీ మార్కు దాటేసింది. 140 సీట్ల అసెంబ్లీలో అధికారం చేపట్టేందుకు అవసరమైన 71 సీట్ల మార్కును దాటింది. తాజా సమాచారం ప్రకారం యూడీఎఫ్ కూటమి 90కి పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార ఎల్డీఎఫ్ 40 సీట్లకు దగ్గర్లో ఆధిక్యంలో ఉంది.

కేరళలో ఏప్రిల్ 9న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 43 ప్రాంతాల్లోని 140 కేంద్రాలలో ఉదయం 8:00 గంటలకు ఓట్లు లెక్కించడం ప్రారంభించారు. దీంతో అధికార ఎల్‌డిఎఫ్, ప్రతిపక్ష యుడిఎఫ్, , బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ మధ్య ముక్కోణపు పోరు కనిపించింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత వెలువడిన ఆరంభ ట్రెండ్స్ చూస్తే.. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ఆధిక్యంలో ఉన్నట్లు చూపించాయి.

Kerala Election Results 2026 Live UDF Surges Ahead Leads in 90 Seats and Crosses Majority Mark


యూడీఎఫ్ ముఖ్యమంత్రి అభ్యర్ధి రేసులో ఉన్న వీడీ సతీషన్.. పరవూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1,606 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలిసారిగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు ఆయన కేబినెట్ సహచరులు కూడా వెనుకబడ్డారు. తాజా ట్రెండ్స్ ప్రకారం, ముఖ్యమంత్రి విజయన్‌తో సహా 14 మంది మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో వెనుకబడి ఉన్నారు. 2021లో పినరయి విజయన్ ధర్మడం నియోజకవర్గంలో 50,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ 93 స్థానాల్లో, వామపక్షాలు 42 స్థానాల్లో, బీజేపీ ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+