బెంగాల్ లో అనుకున్నదే జరుగుతోందా - ఫలితాల పై మమత క్లియర్ సంకేతాలు..!!
పశ్చిమ బెంగాల్ లో గెలిచేదెవరు. ఈ సాయంత్రంతో రెండో విడత ఎన్నికల ప్రచారం పూర్తి కానుంది. ఈ నెల 29న రెండో విడత పోలింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలి విడత పోలింగ్ తరువాత బీజేపీ నేతలు తమదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తన్నారు. ఇటు సీఎం మమతా సైతం తమ గెలుపు ఖాయమని చెబుతున్నారు. అయితే.. గతం కంటే భిన్నంగా రికార్డు స్థాయిలో జరిగిన ఫలితాల పైన కొత్త అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల ఫలితాల పైన స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి.
బెంగాల్ లో రెండో విడత పోలింగ్ ప్రచారం ముగింపు వేళ సీఎం మమతా ఓటర్లకు సందేశం ఇచ్చారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ తన ఎన్నికల ప్రచారం ముగించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో మరోసారి వస్తానని ధీమా వ్యక్తం చేసారు. కాగా... సీఎం మమతా బెనర్జీ ఓటర్లకు సందేశంగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అందు లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 'మా-మాటి-మానుష్' (తల్లి, నేల, ప్రజలు) విజయం ఖాయమని పేర్కొన్నారు. బెంగాల్ సంస్కృతి, వారసత్వాన్ని రక్షించుకోవాలని, విభజన శక్తులను తిప్పికొట్టాలని ఓటర్లను కోరారు. 'మా-మాటి-మానుష్ ఇక అంచనాలకు సంబంధించిన విషయం కాదు, కాలమే సమాధానమిస్తుంది' అని అన్నారు. ఐకమత్యం, సంస్కృతి, నాగరికత బెంగాల్‌కు గర్వకారణమని, బెంగాల్ వారసత్వాన్ని దిగజార్చాలనుకునే విభజన, విధ్వంసకర శక్తులకు రాష్ట్రంలో చోటులేదని పరోక్షంగా బీజేపీని ప్రస్తావిస్తూ మమత బెనర్జీ ఘాటుగా విమర్శించారు. బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

బీజేపీ - టీఎంసీ పార్టీల ధీమా... పెరుగుతున్న ఉత్కంఠ
రాష్ట్రంలో అభివృద్ధి నలుదిశలకు విస్తరిస్తున్న తరుణంలో ఏ దుష్టశక్తీ దానిని అడ్డుకోలేదని పేర్కొన్నారు. ప్రజాసంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ చర్యలు బెంగాల్ ప్రజలకు రక్షణకవచమని, వీటిని అడ్డుకోవడం భూప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాదని అన్నారు. కులం, మతం, భాష, నేపథ్యంతో సంబంధం లేకుండా ఈనెల 29న ప్రజలంతా జోరపూల్ (రెండు పువ్వులు) గుర్తుకు ఓటు వేసి మా-మాటి-మనుష్ అభ్యర్థులకు అఖండ విజయం చేకూర్చాలి' అని మమత బెనర్జీ కోరారు. భవానీపూర్ నియోజక వర్గం నుంచి మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తొలి విడత పోలింగ్ జరిగిన 152 నియోజకవర్గాల్లో 110 స్థానాలను తాము గెలుచుకోనున్నామని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. బీజేపీ వాదనను టీఎంసీ తోసిపుచ్చింది. వరుసగా నాలుగోసారి టీఎంసీ అధికారంలోకి రానుందని చెప్పింది. మే 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్న వేళ.. తుది ఫలితాల పైన ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications