Election Results 2026: ఓటమి బాటలో ముగ్గురు సీఎంలు, డజన్ల కొద్దీ మంత్రులు..!

ఇవాళ వెలువడుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు (Chief Ministers) భారీ షాకులిస్తున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళలో ప్రస్తుతం ముఖ్యమంత్రులుగా ఉన్న ఎంకే స్టాలిన్ (Mk stalin), మమతా బెనర్జీ (mamata banerjee), పినరయి విజయన్ (pinarayi vijayan) ఓటమి బాటలో ఉన్నారు. వీరితో పాటు వీరి కేబినెట్లలో మంత్రులు సైతం డబన్ల సంఖ్యలో వెనుకంజలో ఉన్నారు. దీంతో ఇన్నాళ్లూ అధికారం చెలాయించిన వీరికి జనం భారీ షాక్ ఇచ్చినట్లయింది.

Kerala Election Results 2026: కేరళ తీర్పు క్లియర్-యూడీఎఫ్ చేతిలో ఎల్డీఎఫ్ చిత్తు..!
Kerala Election Results 2026: కేరళ తీర్పు క్లియర్-యూడీఎఫ్ చేతిలో ఎల్డీఎఫ్ చిత్తు..!

ముందుగా బెంగాల్లోని భవానీపూర్ సీటులో పోటీ చేసిన మమతా బెనర్జీ అక్కడ బీజేపీ నేత సువేందు అధికారి కంటే వెనుకబడ్డారు.
ఆరంభ రౌండ్లలో ఆధిక్యం కనబరిచినా ఆ తర్వాత మమతా బెనర్జీ వెనుకబడ్డారు. దీంతో 2021లో నందిగ్రామ్ ఎన్నికల్లో మమతను ఓడించిన సువేందు అధికారి .. ఈసారి భవానీపూర్ లో ఆమెను ఓడిస్తారా అన్న చర్చ జరుగుతోంది. అలాగే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం తాను పోటీ చేసిన కొలత్తూర్ సీటులో ఓటమి బాటలో ఉన్నారు. టీవీకే అభ్యర్ధి వీఎస్ బాబు స్టాలిన్ పై 1200 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

MK Stalin Mamata Banerjee and Pinarayi Vijayan Trailing Chief Ministers and Ministers Face Defeat
Vijay: తమిళనాడు సీఎంగా విజయ్..! మొదలైన ప్రోటోకాల్-ఇంటికి భారీ భద్రత..!
Vijay: తమిళనాడు సీఎంగా విజయ్..! మొదలైన ప్రోటోకాల్-ఇంటికి భారీ భద్రత..!

మరోవైపు కేరళలో సీఎం పినరయి విజయన్ కు సైతం ఓటమి తప్పేలా లేదు. విజయన్ కంచుకోట ధర్మదం సీటులో వెనుకంజలో ఉన్నారు. రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత విజయన్ పై యూడీఎఫ్ అభ్యర్ధి వీపీ అబ్దుల్ రషీద్ 2523 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే విజయన్ గెలుపు కష్టమేనని అర్దమవుతోంది. మరోవైపు అస్సాంలో హిమంత బిశ్వశర్మ, పుదుచ్చేరిలో రంగస్వామి మాత్రం విజయాల బాటలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+