విజయ్ ను గెలిపించిన సీన్
తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతోంది. 210కు పైగా స్థానాల నుంచి అందిన తాజా ట్రెండ్స్ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ తర్వాత, ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రస్తుతం వేగంగా సాగుతోంది. ప్రారంభం విజయ్ స్థాపించిన తమిళన వెట్రి కజగం పార్టీ దూకుడు కనిపించింది. దీర్ఘకాలంగా తమిళనాట పాతుకుపోయిన రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే పార్టీ అధికారాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. ఏఐఏడీఎంకేదీ అదే పరిస్థితి.
ఈ ఎన్నికల్లో అతి పెద్ద సంచలనం.. టీవీకే అద్భుతమైన ప్రదర్శన కనపర్చడం. ఈ ఎన్నికలతోనే అరంగేట్రం చేసిన టీవీకే 100 కు పైగా స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. ఏఐఏడీఎంకే రెండు, డీఎంకే మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక్కడ హంగ్ తప్పకపోవచ్చు. ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 సీట్ల మెజారిటీ వచ్చే అవకాశాలు ప్రస్తుతానికి లేనట్టే. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది టీవీకే. ఇంకా కౌంటింగ్ కొనసాగుతోండటంతో సీట్ల సంఖ్య మరింత పెరగొచ్చు.

ఈ ఎన్నికల్లో విజయ్ మాజీ కారు డ్రైవర్ తనయుడు శబరినాథన్ పై అందరి చూపూ నిలిచింది. ఓ సాధారణ వ్యక్తికి టికెట్ ఇచ్చారు విజయ్. డీఎంకేకు పట్టం కట్టే విరుగంబాక్కం నియోజకవర్గంలో ఆయనను నిలబెట్టారు. ఓ సాధారణ కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, పైగా అది విరుగంబాక్కం సీట్ కావడం అప్పట్లో సంచలనం రేపింది. ఇప్పుడు దీన్ని రెట్టింపు చేసింది. విరుగంబాక్కంలో శబరినాథన్ భారీ ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
శబరీనాథన్.. విజయ్ వ్యక్తిగత కారు డ్రైవర్ రాజేంద్రన్ తనయుడు. సంవత్సరాల తరబడి విజయ్ డ్రైవర్ గా, ఆ తరువాత వ్యక్తిగత సహాయకుడిగా సేవలందించారు రాజేంద్రన్. దీనికి కృతజ్ఞతగా ఆయన కుమారుడు శబరీనాథన్ కు టికెట్ ఇచ్చారు. ఇప్పుడాయన గెలవడం లాంఛనప్రాయమే. బీఫామ్ తీసుకున్నప్పుడు శబరీనాథన్ తీవ్ర భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. విజయ్ చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్నప్పుడు తండ్రి, కొడుకు ఇద్దరూ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నారు.
శబరినాథన్ విజయ్ పాదాలను తాకి, భావోద్వేగంతో ఆయన్ని కౌగిలించుకున్నారు. విజయ్ ఆయన కన్నీళ్లు తుడవడం అప్పట్లో ఆకట్టుకుంది. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వైరల్ అయ్యాయి. సినీ కెరీర్ ఆరంభం నుండి తన వెన్నంటే ఉన్న వ్యక్తి కుమారుడికి విజయ్ సీటు ఇవ్వడం విజయ్ గొప్పమనసుకు అద్దంపట్టిందని నెటిజన్లు ప్రశంసించారు.












Click it and Unblock the Notifications