Tamil Nadu Forecast: తమిళనాడు విజేత ఎవరు ? తేల్చేసిన సత్తా బజార్..!

తమిళనాడు (tamil nadu) అసెంబ్లీకి ఈ నెల 23న జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రికార్డులు తిరగరాసింది. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85 శాతం మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేశారు. దీంతో ఈ భారీ ఓటింగ్ శాతం ఎవర్ని గట్టెక్కించబోతోంది ? ఎవరిని ముంచబోతోంది ? కింగ్ లు మాత్రమే ఉంటారా లేక కింగ్ మేకర్లు కూడా అవతరిస్తారా ? అన్న ప్రశ్నలు సాధారణ ఓటర్లతో పాటు రాజకీయ వర్గాలను సైతం పట్టి పీడిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తమిళనాడులో ఎన్నికల పోలింగ్ అనంతరం ఫలోడీ సత్తా బజార్ వెలువరించిన అంచనాలు ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేశాయి. ఫలోడీ సత్తా బజార్ అంచనాల ప్రకారం తమిళనాడులో ముక్కోణపు పోరు జరిగింది. అయితే ఇందులో కొత్త పార్టీ పెట్టి తొలిసారి అదృష్టం పరీక్షించుకుంటున్న హీరో విజయ్.. విపక్ష అన్నాడీఎంకే కూటమి ఓట్లకు భారీగా గండి కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో డీఎంకే కూటమి రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైందని తెలుస్తోంది.

Tamil Nadu s Three-Way Fight Satta Bazar Has Already Picked a Winner

పోలింగ్ ముగిసిన తర్వాత ఫలోడో సత్తా బజార్ విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం.. 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే సుమారు 141-144 సీట్లు గెలుచుకుంటుందని తేలింది. ఇది మెజారిటీ మార్కు అయిన 118 కన్నా చాలా ఎక్కువ అని అంచనా వేశారు. మరోవైపు, ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ వెనుకబడి ఉంటుందని, ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దించడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని అంచనా.

Desclaimer : ఫలోడి సత్తా బజార్ ఒక అధికారిక పోలింగ్ సంస్థ కాదు మరియు ఇది ఒక అనధికారిక, తరచుగా చట్టవిరుద్ధమైన బెట్టింగ్ నెట్‌వర్క్‌గా పనిచేస్తుంది. దీని అంచనాలు శాస్త్రీయ నమూనా సేకరణపై కాకుండా బెట్టింగ్ పోకడలు మరియు అభిప్రాయాలపై ఆధారపడి ఉంటాయి, కాబట్టి వీటిని జాగ్రత్తగా పరిగణించాలి. ఈ అంచనాలను వన్ ఇండియా తెలుగు వెబ్ సైట్ స్వతంత్రంగా ధృవీకరించదు. ఈ అంచనాలతో వన్ ఇండియా తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+