సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం వేళ గవర్నర్ ఊహించని జలక్..!?
తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అంచనా లకు అందని విజయ్ సాధించిన విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలంకు కొంత దూరంలో విజయ్ పార్టీ ఆగిపోయింది. ఎవరి మద్దతు తీసుకోవాలనే అంశం పైన విజయ్ కోర్ టీం ఇప్పటికే రెండు ప్రతిపాదనలు సిద్దం చేసింది. ప్రభుత్వ ఏర్పాటు పైన ఈ రోజు విజయ్ గవర్నర్ ను కలిసేందుకు సిద్దమయ్యారు. కాగా.. సంఖ్య బలం విషయం పై స్పష్టత రాని వేళ గవర్నర్ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. టీవీకే నేతలకు ఊహించని జలక్ ఇచ్చారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ గురువారం ప్రమాణ స్వీకారం చేస్తారని.. పార్టీ శాసనసభా పక్షనేతగా ఎన్నికైన ఆయన బుధవారం రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌తో సమావేశమవుతారని టీవీకే నాయకత్వం ప్రకటించింది. కానీ అంతలోనే గవర్నర్ ఆయనకు ఝలక్ ఇచ్చారు. ఆయన ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ను ఆహ్వానించాలని టీవీకే నేతలు కోరగా.. మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య తదితర వివరాలు అడిగానని.. వాటి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

ఆ వివరాలు సమర్పించాకే విజయ్‌తో భేటీ అవుతానని స్పష్టం చేశారు. టీవీకే తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేల వివరాలు, ఆ పార్టీకి మద్దతిచ్చే పార్టీల సభ్యుల వివరాలను తెలిపిన మీదటే తగిన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఆ పార్టీ ప్రతినిధులెవరూ తనను కలువలేదని.. కొన్ని సమాచారాలను మాత్రమే పంపారని, అందులో తమ పార్టీ ఎంత శాతం ఓట్లు సంపాదించిందన్న వివరాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. అధికారికంగా అన్ని వివరాలతో లోక్‌భవన్ అధికారులను సంప్రదించాలని వారికి సూచించానని చెప్పారు.
రేపు ప్రమాణ స్వీకారానికి విజయ్ సిద్దం
కాగా, గవర్నర్ వ్యాఖ్యల పైన టీవీకే స్పందించింది. గవర్నర్ అడిగిన వివరాలన్నీ అందించామని, అధిక సంఖ్యాబలమున్న పార్టీ తమదేనంటూ గణాంకాలతో పంపామని స్పష్టం చేసింది. ఈ రోజు (బుధవారం) ఆయన అపాయింట్‌మెంట్ కోరామని, అంతేగాక గురువారం ఉదయం 11.30 గంటలకు విజయ్‌తో సీఎంగా పదవీ ప్రమాణం చేయించాలని కూడా స్పష్టంగా అభ్యర్థించామని ప్రకటించింది. సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో టీవీకే 108 స్థానాలు సాధించిన సంగతి తెలిసిందే. 234 స్థానాల రాష్ట్ర అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి 118 స్థానాలు అవసరం కాగా.. విజయ్ పార్టీ 10 సీట్ల దూరంలో నిలిచింది.
దీంతో కాంగ్రెస్, పీఎంకే, వామపక్షాల మద్దతు కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అటు ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ ఆమోదించారు. గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని భావిస్తున్న ఆయన.. వారందరినీ రాజధానిలోనే ఉండాలని ఆదేశించారు. డీఎంకే కూటమిలోని కాంగ్రెస్(5), సీపీఎం(2), సీపీఐ(2), వీసీకే(2)లతో పాటు అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే(4)తో చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే.. సీఎంగా శాససభలో బల నిరూపణ చేసుకునేందుకు తాము సిద్దమని గవర్నర్ కు విజయ్ చెప్పే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. రేపు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దం అవుతోంది.













Click it and Unblock the Notifications