TVKలోకి డీఎంకే నుంచి 10, అన్నాడీఎంకే నుంచి 15 మంది ఎమ్మెల్యేలు..??

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ టీవీకే పార్టీ రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను 108 స్థానాల్లో విజయ్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. మ్యాజిక్ ఫిగర్ కు కేవలం 10 సీట్లు మాత్రమే కావాల్సి ఉండగా.. దాంతో విజయ్ కు మద్దతుగా నిలిచేందుకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ సిద్ధమవుతున్నారు. అయితే ఈ క్రమంలో తమిళనాడులో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు టీవీకే పార్టీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ మేరకు విజయ్ తో టచ్ లోకి దాదాపు 10 మంది డీఎంకే ఎమ్మెల్యేలు వచ్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఏఎంఎంకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి టీవీకే పార్టీలో చేరేందుకు ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలాఉండగా విజయ్ కు కెప్టెన్ విజయకాంత్ డీఎండీకే పార్టీ పూర్తి మద్దతు ఇచ్చింది. ఈ మేరకు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రేమలత విజయకాంత్ విజయ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ తమ కుటుంబ సభ్యుడని పేర్కొన్నారు. విజయ్ మొదటినుంచి కెప్టెన్ తోనే ఉన్నారని గుర్తుచేశారు. ఈ మేరకు విజయ్ కు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇక తమిళనాడు ఎన్నికల్లో డీఎండీకే పార్టీ ఒకే ఒక్క సీటును కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

TVK Creates History in Tamil Nadu Vijay s Party Wins Big as 10 DMK and 15 AIADMK MLAs to Join TVK

ఇక విజయ్ టీవీకే పార్టీలోకి డీఎంకే నుంచి ఓ 10 మంది ఎమ్మెల్యేలు.. అలాగే అన్నాడీఎంకే నుంచి మరో 15 మంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉన్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు ఇప్పటికే విజయ్ కు ఉంది. వీరితో పాటు పట్టై మక్కల్ కట్చీ(పీఎంకే) పార్టీ నుంచి నలుగురు, ఐయూఎమ్ఎల్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే ఇప్పటికే విజయ్ ను కలిసి మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో విజయ్ పార్టీలోకి దాదాపు 130 మందికి పైగా ఎమ్మెల్యేలు వచ్చి చేరనున్నట్లు పలువురు విశ్లేషిస్తున్నారు. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీ శాసనసభాపక్షనేతగా విజయ్ తాజాగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయ్ ను శాసనసభాపక్ష నేతగా టీవీకే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. విజయ్ మే 7 న తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+