అన్న అప్పట్లోనే హింట్ ఇచ్చిండు..!!
తమిళనాడులో విజయ్ ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో 2024 లో టీవీకే పార్టీ పెట్టిన విజయ్ రెండెళ్లలోనే సీఎం పదవి చేపట్టడం ప్రత్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించింది. అధికార డీఎంకే 73 స్థానాలకు పరిమితం కాగా.. అన్నాడీఎంకే 53 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీ శాసనసభాపక్షనేతగా విజయ్ తాజాగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయ్ ను శాసనసభాపక్ష నేతగా టీవీకే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఇక తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 10 మంది ఎమ్మెల్యేలు అధనంగా కావాల్సి ఉంటుంది.
అయితే విజయ్ కు సీఎం కావాలని ఎప్పటినుంచో కోరిక ఉన్నట్లు తెలుస్తోంది. 2024 లో విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(GOAT) చిత్రంలోని ఓ సీన్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలోని ఓ సీన్ లో విజయ్ తన కారును నడుపుతూ కనిపిస్తారు. అయితే ఆ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ "TN 07 CM 2026" కావడం విశేషం. అయితే ఇక్కడ TN అంటే తమిళనాడు అని అర్థం వస్తుంది. CM అంటే ముఖ్యమంత్రి అని ఇక 2026 అంటే సంవత్సరం అని అప్పట్లోనే అభిమానులకు హింట్ ఇచ్చారు విజయ్. ఇక ఈ మూవీ దర్శకుడు వెంకట్ ప్రభు.. విజయ్ స్టామినాను గుర్తించి అప్పట్లోనే విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఇలా డీటేయిలింగ్ ఇచ్చారంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇక విజయ్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశారు. తిరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి ఆయన పోటీ చేసి రెండు చోట్లా విజయం సాధించారు. అయితే సీఎం అయ్యాక విజయ్ ఏదో ఒక సీటును వదులుకోవాల్సి ఉంటుంది. దాంతో పెరంబూర్ ను అట్టిపెట్టుకుని తిరుచ్చి(ఈస్ట్) సీటుకు ఆయన రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ కంటే విజయ్ కు తక్కువ సీట్లు వచ్చాయి. దాంతో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం వంటి ఇతర పార్టీల మద్దతుతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా టీవీకే ప్రణాళికలు చేస్తోంది. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ తమిళనాడు గవర్నర్ కు విజయ్ లేఖ రాసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications