విజయ్ సంచలన నిర్ణయం.. 107 మంది TVK ఎమ్మెల్యేలు రాజీనామా..??
తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుగా నిలిచిన టీవీకే అధినేత విజయ్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 107 మంది శాసనసభ్యులు రాజీనామా చేస్తారని ఈ మేరకు తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ స్పష్టం చేసింది. డీఎంకే, అన్నాడీఎంకే నేతల మధ్య జరిగిన రెండు సమావేశాల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.
టీవీకే మొత్తం 108 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. వాటిలో రెండింటిని విజయ్ సాధించారు. పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా తమకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తొలి అవకాశం ఇవ్వాలని టీవీకే డిమాండ్ చేస్తోంది. అయితే గవర్నర్ ఆర్.వి. అర్లేకర్ విజయ్ ప్రయత్నాన్ని తిరస్కరించారు. మెజారిటీకి 118 మంది మద్దతు లేఖలు సమర్పించాలని ఆయన షరతు విధించారు.
అత్యధిక స్థానాలు గెలిచిన తమను పక్కకు నెట్టి, డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కుమ్మక్కయ్యాయని టీవీకే తీవ్రంగా అనుమానిస్తూ రాజీనామా హెచ్చరిక చేసింది. టీవీకే సంఖ్యాబలంపై గవర్నర్ వ్యక్తం చేసిన సందేహాలతో విజయ్ ప్రమాణస్వీకారం అనిశ్చితిలో పడింది. ప్రస్తుతం టీవీకే మిత్రుల మద్దతు కోసం చూస్తుండగా వీసీకే ఇంకా తమ వైఖరిని స్పష్టం చేయలేదు.

ఇక తమిళనాడులో అన్నాడీఎంకే- డీఎంకే మధ్య పొత్తు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. తాము కూడా మ్యాజిక్ ఫిగర్ 118 కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో మహా అద్భుతం జరుగుతుందంటూ హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు సినిమాల్లో మించిన ట్విస్టులను గుర్తుచేస్తున్నాయి.












Click it and Unblock the Notifications