వామ్మో.. ఆ దేశంలో ఒక్కో వ్యక్తి 14 మందితో అఫైర్.. భారత్ లో ఎంత మంది అంటే..?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆచారాలు, కట్టుబాట్లు మారిపోయాయి. లీవ్ ఇన్ రిలేషన్ షిప్ అనేది కామన్ అయిపోయింది. అనేక దేశాల్లో కాలేజీ డేస్ నుంచి యువతీయువకుల్లో శృంగారం లవాటుగా మారిపోయింది. ప్రస్తుతం మారుతున్న జీవన శైలి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని వ్యక్తుల లైంగిక భాగస్వాములకు సంబంధించిన సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచ దేశాల్లో ఒక్కో వ్యక్తి ఎంత మందితో అఫైర్ పెట్టుకున్నారో సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
పార్ట్ నర్స్ డేటా సర్వేలో భాగంగా టర్కీ దేశం తొలిస్థానంలో ఉంది. ఆ దేశంలో ఒక్కో వ్యక్తికి సగటున 14.5 మంది భాగస్వాములు ఉన్నట్లుగా సర్వే స్పష్టం చేసింది. ఇక టర్కీ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐస్ లాండ్, దక్షిణాఫ్రికా తదితర దేశాలు నిలిచాయి. అయితే ప్రపంచదేశాల్లోని ఆయా వ్యక్తులు స్వయంగా వెల్లడించిన సమాచారాన్ని ఆధారంగా తీసుకుని ఈ లిస్టును తయారు చేయడం గమనార్హం. అయితే ఈ సర్వేలో వాళ్లు నిజమే చెప్పారా..? లేక అబద్దం చెప్పారా..? అనేది మాత్రం తెలియదు.
ఇక పార్ట్ నర్స్ డేటా సర్వేలో భారత్ చివరి స్థానాల్లో ఉన్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. మన దేశంలో ఒక్కో వ్యక్తికి సుమారు ముగ్గురు భాగస్వాములు మాత్రమే ఉన్నట్లుగా డేటా పేర్కొంది. ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన భారత్ లో ఒక్కో వ్యక్తి ముగ్గురు భాగస్వాములు మాత్రమే ఉండటం.. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా భావించవచ్చు. కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు, స్థిరమైన సంబంధాలపై నమ్మకం తదితర అంశాలు దీనికి ప్రధాన కారణాలుగా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

అయితే ఇలాంటి విషయాలను బహిరంగంగా మాట్లాడటంపై కొందరు మొహమాటంతో కచ్చితమైన సమాచారం వెల్లడించలేక పోవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి విషయాలను బయటకు చెబితే విమర్శలు వస్తాయన్న భయం, సామాజిక ఒత్తిడి వంటి అంశాలు సర్వే ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. అలాగే ప్రస్తుతం చాలామందికి ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. హెచ్ఐవీ- ఎయిడ్స్ వంటి వ్యాధులపై ఉన్న జాగ్రత్తల కారణంగా కొందరు భాగస్వాములను ఏర్పరచుకోవడంలో సంకోచిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications