సమ్మర్ లో బ్యాంకాక్ టూర్ వెళ్లొద్దామా.. బడ్జెట్ ధరలో.. బీచ్ లో ఫుల్ ఎంజాయ్..!
ఎండలు మండిపోతున్నాయి. పిల్లలకు వేసవి సెలవులు కూడా ఇచ్చేశారు. అయితే వేసవిలో ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా టూర్ కు వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే ఇప్పుడు తక్కువ ధరకే బ్యాంకాక్ వెళ్లే అవకాశం ఉంది. సమ్మర్ లో బ్యాంకాక్ టూర్ చాలా అద్భుతంగా ఉంటుంది. వేసవి వేళ ఇక్కడి బీచ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేయోచ్చు. అసలు థాయ్ లాండ్ అంటేనే బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అంటుంటారు పర్యటకులు. రైల్వేశాఖ తీసుకొచ్చిన ఈ అద్భుతమైన ఆఫర్ ద్వారా థాయ్ లాండ్ టూర్ ను తక్కువ ధరకే ఎంచక్కా పూర్తిచేయొచ్చు. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే టూర్ మొత్తం నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు ఉంటుంది. థాయ్ లాండ్ లోని ప్రముఖ టూరిస్టు ప్రాంతాలైన పట్టయ, బ్యాంకాక్ లోని పలు ప్రాంతాలను వీక్షించే అవకాశం ఉంది. ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
టూర్ వివరాల ప్రకారం హైదరాబాద్ లోని ఎయిర్ పోర్ట్ నుంచి తెల్లవారుజామున 4 గంటలకు ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అలా ఉదయం 10 గంటలకు బ్యాంకాక్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి పట్టయ చేరుకుంటారు. అలా వెళ్తుండగా మార్గమధ్యలో టైగర్ జూను విజిట్ చేస్తారు. సాయంత్రం జెమ్స్ గ్యాలరీ, అల్కజార్ షోను వీక్షిస్తారు. ఇక రెండోరోజు కోరల్ ద్వీపంలో స్పీడ్ బోట్ ఉంటుంది. బీచ్ లో ఎంజాయ్ చేసిన తర్వాత నూంగ్ నుచ్ ట్రాపికల్ గార్డెన్ ను విజిటింగ్ చేస్తారు.

ఆ తర్వాత మూడోరోజు సఫారీ వరల్డ్ టూర్ ను సందర్శిస్తారు. అలా సాయంత్రానికి బ్యాంకాక్ చేరుకుంటారు. ఇక నాలుగోరోజు బ్యాంకాక్ అందాలను వీక్షిస్తారు. సిటీ మొత్తం రౌండప్ చేస్తారు. ఇక ఐదోరోజు తిరిగి హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ. 40 వేల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు, టికెట్ ధరలు, బుకింగ్ సమాచారం కోసం అధికారిక ఐఆర్సీటీసీ సైట్ ను సంప్రదించండి.












Click it and Unblock the Notifications