హైదరాబాద్‌కు అంతర్జాతీయ దిగ్గజ సంస్థ.. నిరుద్యోగులకు పండుగే!

తెలంగాణా ప్రభుత్వం మన రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుంది. తాజాగా జర్మనీకి చెందిన ప్రముఖ రసాయన సంస్థ BASF హైదరాబాద్‌లో గ్లోబల్ సర్వీస్/డిజిటల్ హబ్‌ను ఏర్పాటు చేస్తూ భారీ అంతర్జాతీయ పెట్టుబడిని తీసుకొస్తోంది. ఈ కంపెనీ గ్లోబల్ డిజిటల్ సర్వీసెస్ నెట్‌వర్క్‌లో కీలక భాగంగా పనిచేయనుంది.

ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపారాలకు డిజిటల్ సేవలు అందించేలా BASF హబ్

ఈ హబ్ ద్వారా BASF ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన వ్యాపారాలకు తెలంగాణ కేంద్రంగా డిజిటల్ సేవలను సమగ్రంగా అందించనుంది. యూరప్‌లోని లుడ్విగ్‌షాఫెన్, మాడ్రిడ్, ఆసియా పసిఫిక్‌లోని కౌలాలంపూర్ కేంద్రాలతో కలిసి పనిచేస్తూ, సేవలను మరింత వేగంగా, సమర్థవంతంగా అందించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని రూపొందిస్తున్నారు.

BASF sets up a global service hub in Hyderabad bringing major international investment to Telangana

హైదరాబాద్ లో పెట్టటానికి కారణం ఇదే

హైదరాబాదులో నైపుణ్యం కలిగిన మానవ వనరులు లభిస్తాయి అన్న కారణంతో పాటు, తక్కువ ఖర్చుతో సేవలను అందుబాటులోకి తీసుకురావచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ హబ్ ను ఏర్పరుస్తున్నారు. ఉన్నత స్థాయి ఐటి మౌలిక సదుపాయాలు ఉన్న నగరం కావడంతో, ప్రభుత్వం వైపు నుంచి కూడా తగినంత సహకారం అందిస్తున్న క్రమంలో ఈ సంస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.

BASF గ్లోబల్ వ్యూహంలో భాగంగా తీసుకున్న కీలక నిర్ణయం

ఈ హబ్ ద్వారా డిజిటల్ సేవలను ఒకే చోట కేంద్రీకరించడం వల్ల సంస్థకి ఖర్చులు తగ్గడంతో పాటు పనితీరు మెరుగుపడుతుంది. ఇది BASF గ్లోబల్ వ్యూహంలో భాగంగా తీసుకున్న కీలక నిర్ణయం. డిజిటల్ సేవలను ప్రామాణీకరించడం, సంక్లిష్టతను తగ్గించడం, ముఖ్య వ్యాపారాలకు విలువను పెంచే రంగాలపై దృష్టి పెట్టడం వంటి లక్ష్యాలను ఈ ప్రాజెక్ట్ సాధించనుంది.

హైదరాబాద్ MMTS సెకండ్ ఫేజ్ విస్తరణపై శుభవార్త.. కొత్తగా ఆ రూట్లలో స్టేషన్లు!
హైదరాబాద్ MMTS సెకండ్ ఫేజ్ విస్తరణపై శుభవార్త.. కొత్తగా ఆ రూట్లలో స్టేషన్లు!

3,000 మందికి కొత్త ఉద్యోగ అవకాశాలు

హైదరాబాద్లో దీనిని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టుతో దాదాపు 3,000 మందికి కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఈ కేంద్రం ద్వారా భారత్‌లో BASF స్థిరమైన ప్రస్థానం మరింత బలపడనుండగా, హైదరాబాద్ అంతర్జాతీయ పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్నదనే విషయం మరోసారి స్పష్టమవుతోంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్న విషయాన్ని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+