ప్రజావాణి సేవల పై రేవంత్ కీలక ఆదేశాలు, ఇక నుంచి...!!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజావాణి విస్తరణ దిశగా అధికారులకు స్పష్టత ఇచ్చారు. ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి అర్జీ తప్పనిసరిగా నమోదు చేయాలని.. నిర్ణీత గడువులో పరిష్కారం చేయాలని సూచించారు. ఆలస్యం జరిగితే అధికారులదే బాధ్యత అని స్పష్టం చేశారు.

ప్రజావాణి సేవల పై సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 2023 డిసెంబర్ 8వ తేదీన ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ప్రతి మంగళ, శుక్రవారం ప్రజా భవన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా స్థాయిలో కూడా వారానికి ఒకసారి నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రజావాణి సేవల విస్తరణపై ఫోకస్ పెట్టామని అన్నారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో వెంటనే ప్రజావాణి ప్రారంభించాలని దిశానిర్దేశం చేశారు. తదుపరి దశలో మండల స్థాయికి విస్తరిస్తున్నామని తెలిపారు. దూర ప్రాంతాల ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఫిర్యాదుల పరిష్కారంపై కఠిన ఆదేశాలు జారీ చేశామని అన్నారు. ప్రతి అర్జీ తప్పనిసరిగా నమోదు చేయాలని.. నిర్ణీత గడువులో పరిష్కారం చేయాలని సూచించారు. ఆలస్యం జరిగితే అధికారులదే బాధ్యత అని స్పష్టం చేశారు. ఫిర్యాదుల కోసం ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

cm-revanth-directed-officials-to-strengthen-and-expand-the-state-s-public-grievance-redressal-system

అధికారులకు దిశా నిర్దేశం

రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు. డ్యాష్‌బోర్డ్ ద్వారా పురోగతిని పర్యవేక్షిస్తామని చెప్పుకొచ్చారు. ప్రతి స్థాయిలో నోడల్ అధికారుల నియమిస్తున్నట్లు ప్రకటన చేసారు. ప్రతీ జిల్లా, శాఖలో ప్రజావాణి విభాగాల ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒక స్థాయిలో పరిష్కారం కాకపోతే పైస్థాయికి ఆటో ఎస్కలేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అవసరమైతే అప్పీల్ వ్యవస్థ ప్రవేశపెట్టాలని అన్నారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వికేంద్రీకరణతో పెండింగ్ అర్జీలు తగ్గుతాయని స్పష్టం చేశారు.. కిందిస్థాయిలోనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపారు. తమ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెంచడమే లక్ష్యంగా పని చేయాలని సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+