అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవి పై గవర్నర్ కీలక నిర్ణయం, ఇక..!!

గవర్నర్ శివప్రతాప్ శుక్లా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవి పై తేల్చేసారు. మరో అయిదు రోజుల్లో అజారుద్దీన్ మంత్రి అయి ఆరు నెలల కాలం పూర్తి కానుంది. దీంతో.. ఎమ్మెల్సీగా గవర్నర్ ఆమోదం పొందకుంటే మంత్రి పదవికి గండం పొంచి ఉంది. దీంతో.. సీఎం రేవంత్ నేరుగా గవర్నర్ ను కలిసి పరిస్థితి వివరించారు. రాష్ట్ర మంత్రివర్గ తీర్మానం మేరకు అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీలు గా నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీంతో.. గవర్నర్ ఈ రోజు తన నిర్ణయం వెల్లడించారు.

మంత్రి అజారుద్దీన్ కు బిగ్ రిలీఫ్. గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలంగాణ కేబినెట్ తీర్మానం మేరకు అజారుద్దీన్ తో పాటుగా కోదండ రాం ఎమ్మెల్సీ పదవులకు ఆమోదం తెలిపారు. గత ఏడాది ఆగస్టు 30న ఈ ఇద్దరి నియామకం పై కేబినెట్ తీర్మానం చేసి పంపింది. అయితే.. కోర్టులో కేసుల కారణంగా నిర్ణయం పెండింగ్ లో ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా హడావిడిగా అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ నెల 30వ తేదీతో ఆయన మంత్రి పదవి చేపట్టి ఆరు నెలలు ముగుస్తుంది.

Governor Shiv Pratap Shukla accpetes minister Azharuddin and Kodanda Ram MLC s as TG Cabinet resolution

మంత్రి అయిన తరువాత ఆరు నెలల్లోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎంపిక కావాల్సి ఉంటుంది. గవర్నర్ వద్ద నిర్ణయం పెండింగ్ లో ఉండటంతో.. నిర్ణయం ప్రతికూలంగా ఉన్నా.. నిర్ణయం రాకున్నా ఏం చేయాలనే అంశం లో ప్రభుత్వం ప్రత్యామ్నాయాల ను సిద్దం చేసింది. అదే సమయంలో ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ నేరుగా గవర్నర్ ను కలిసి ఎమ్మెల్సీ పదవుల ఆమోదం పైన చర్చించారు.

సీఎం రేవంత్ తో చర్చల తరువాత గవర్నర్ ఈ వ్యవహారం పైన న్యాయ సలహాలు తీసుకున్నారు. ఒక వేళ గవర్నర్ నుంచి నిర్ణయం రాకుంటే.. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల్లో ఎవరితో అయినా రాజీనామా చేయించాలి. దీని కోసం ఇద్దరి పేర్లు పార్టీలో ప్రచారం లోకి వచ్చాయి. అజారుద్దీన్ ఎమ్మెల్సీ నిర్ణయం పైన కొత్తగా వచ్చిన గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ వేళ ఈ రోు గవర్నర్ అజారుద్దీన్ తో పాటుగా కోదండరాం ఎమ్మెల్సీ పదవులకు ఆమోదం తెలిపారు.

దీంతో.. ఇప్పుడు అజారుద్దీన్ మంత్రిగా కొనసాగటానికి లైన్ క్లియర్ అయింది. ఇది అజారుద్దీన్ తో పాటుగా సీఎం రేవంత్ కు బిగ్ రిలీఫ్ గా కనిపిస్తోంది. ఇక.. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ.. అజారుద్దీన్ ను కొనసాగిస్తూనే మార్పులు చేర్పుల దిశగా కసరత్తు చేసే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ తీసుకున్న నిర్ణయం తో .. ఇప్పుడు అజారుద్దీన్ పూర్తి కాలం మంత్రి గా కొనసాగేందుకు మార్గం సుగమం అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+