ఒకే టూర్ లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. హైదరాబాద్ నుంచి బడ్జెట్ ధరకే సూపర్ ప్యాకేజీ..
వేసవి సెలవులు వచ్చేశాయి. సమ్మర్ లో ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా టూర్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా..? టూరిస్ట్ ప్రాంతాలకు కాకుండా ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లి దైవ దర్శనంతో పాటుగా మానసిక ప్రశాంతతను కోరుకుంటున్నారా..? అయితే మీకోసం రైల్వేశాఖ అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ లో భాగంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవచ్చు. అది కూడా తక్కువ ధరకే.. సాధారణంగా అయితే ఒకేసారి ఏడు జ్యోతిర్లింగాల దర్శనం అధిక ఖర్చుతో కూడుకున్నది. కానీ ఐఆర్సీటీసీ అద్భుతమైన ప్యాకేజీని చూస్తే వావ్ అంటారు.
పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునేవారికి ఐఆర్సీటీసీ అద్భుతమైన ప్యాకేజీని తీసుకొచ్చింది. ఏకంగా 7 జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శనం చేసుకునే వీలు కల్పిస్తోంది. తాజాగా ఈ ప్రత్యేకమైన టూర్ ను అందుబాటులోకి వచ్చింది. సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర పేరుతో శైవ భక్తులకోసం ఈ టూర్ ను తీసుకొచ్చింది. ఈ టూర్ మొత్తం 10 రాత్రులు, 11 పగళ్లు పాటు జరుగుతుంది. అలాగే ఈ జ్యోతిర్లింగ దర్శనయాత్ర 16 జూన్ 2026 న ప్రారంభం కానుంది. ఈ టూర్ లో భాగంగా భక్తులు దేశంలోని ఏడు ప్రముఖ జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించుకోవచ్చు.
ఇక సికింద్రాబాద్ నుంచి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, హజూర్ సాహిబ్ నాందేడ్, పూర్ణ జంక్షన్ స్టేషన్లు బోర్డింగ్ పాయింట్స్ గా ఉంటాయి. టూర్ లో భాగంగా మొదటగా భక్తులు ఉజ్జయినీ చేరుకుంటారు. అక్కడ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ జరిగే భస్మ హారతి ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాగే ఉజ్జయినీ తర్వాత ఓంకారేశ్వర్ దర్శించుకుంటారు.

ఆ తర్వాత గుజరాత్ లోని ద్వారకాధీశ్, నాగేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం చేస్తారు. అక్కడినుంచి సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం ఉంటుంది. అక్కడినుంచి పుణెలోని భీమశంకర్ జ్యోతిర్లింగ దర్శనం ఉంటుంది. అనంతరం నాశిక్ లోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం చేస్తారు. చివరగా ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటారు. ఇక ఈ టూర్ కు ఒక్కొక్కరికి రూ. 17 వేల నుంచి స్టార్టింగ్ ఉంటుంది.












Click it and Unblock the Notifications