తెలంగాణ ఉద్యోగులకు రేవంత్ గుడ్ న్యూస్..! కీలక నిర్ణయాలు..!

తెలంగాణ ఉద్యోగులు (Telangana Employees) ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఇవాళ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) వారికి కీలక హామీలు ఇచ్చారు. ముఖ్యంగా నాలుగు అంశాలపై ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం స్పష్టత ఇచ్చారు. ఇందులో ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాల బకాయిలు, పీఆర్సీ నివేదిక, ఉద్యోగుల హెల్త్ కార్డులు వంటి అంశాలు ఉన్నాయి. వీటిపై కీలక హామీలు ఇవ్వడంతో పాటు రెండు నెలలకోసారి ఉద్యోగ సంఘాలతో సమావేశం కావాలని నిర్ణయించారు.

ఉద్యోగ సంఘాలతో ఇవాళ సమావేశం నిర్వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వంద రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రూ. 6000 కోట్లు చెల్లిస్తామని వారికి హామీ ఇచ్చారు. అలాగే పీఆర్సీ పై తక్షణమే రిపోర్టు అందించాలని అధికారుల కమిటీని ముఖ్యంత్రి ఆదేశించారు. దీంతో పాటు రిపోర్ట్ ఆధారంగా పీఆర్సీపీపై నిర్ణయం తీసుకుంటామని కూడా ప్రకటించారు. దీంతో పీఆర్సీ విషయంలో ఆందోళన చెందుతున్న ఉద్యోగులకు కాస్త ఊరట దక్కింది.

Revanth Reddy Clarifies Telangana Employee Retirement Benefits Health Cards and PRC Report 2026

మరోవైపు జూన్ 1 లోగా ఉద్యోగులకు హెల్త్ కార్డుల్ని అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు.
దీంతో పాటు ప్రతి రెండు నెలలకోసారి గుర్తింపు సంఘాలు సమావేశమై సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్టు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది అని వారికి భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ తో భేటీ, హామీలపై తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+