రైతు భరోసా పెండింగ్ నిధుల పై కీలక నిర్ణయం, ఇక అప్పుడే..!!
రైతులకు బిగ్ అప్డేట్. తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్‌కు సంబంధించి రెండో విడత రైతుభరోసా నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేసింది. 45,11,947 మంది రైతులకు రూ.2,206 కోట్ల నిధులు నేరుగా జమ అయ్యాయి. మొదటి విడత నిధులతో కలిపి మొత్తం రూ.5,653 కోట్లు రైతాంగానికి అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే, రెండో విడత నిధుల్లోనూ ఒక ఎకరం నుంచి రెండెకరాల వరకు ఉన్న రైతులకే ప్రాధాన్యత ఇచ్చింది. నిధులు అందని వారికి అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ఈ మేరకు అర్హత ఉన్న ప్రతీ రైతు ఖాతాల్లోనూ నిధులు జమ అవుతాయని వెల్లడించింది. మొత్తం రూ 2,206 కోట్ల రూపాయలను 45 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది. అయితే.. నిధుల జమ ప్రక్రియ మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ ఏప్రిల్ 25వ తేదీ లోపు ఖాతాలో డబ్బులు జమ కానట్లయితే.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
ఇదే సమయంలె అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ కాకుంటే.. స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇక మండల వ్యవసాయ అధికారిని కలిసి ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే విధంగా అర్హల జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవటంతో పాటుగా బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ అయిందా..? లేదా..? బ్యాంక్ కేవైసీ యాక్టివ్‌లో ఉందా..? లేదా? అనే వివరాలు పరిశీలన చేయాలని సూచన చేస్తున్నారు. అదే విధంగా పాస్ బుక్ వివరాలు ధరణి పోర్టల్‌లో చెక్ చేసుకుని రిజిస్టర్ అయ్యాయా..? లేదా? అనే డీటైల్స్ తనిఖీ చేయటం అవసరమని పేర్కొన్నారు.

నిధులు జమ కాకుంటే ఇలా చేయండి
కాగా, కొత్తగా పట్టాదారు పాస్ బుక్ పొందిన సమయంలో సకాలంలో రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. గడువులోగా చేసుకోకపోతే డబ్బులు పడవని చెబుతున్నారు. నగదు జమ కాని రైతులు తమ స్థానిక అధికారులను అడిగి సమస్యను పరిష్కరించుకుంటే తర్వాతి విడతలో డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేసారు. ఎవరికైనా సాంకేతిక సమస్యలతో నగదు జమ కాకుంటే అధికారుల కు ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని వెల్లడించారు. ఫార్మర్ రిజిస్ట్రీలో పేరు నమోదు తప్పనిసరి చేసారు. ప్రభుత్వ పథకాల నుంచి లబ్ది పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీలో రిజిస్ట్రర్ అయి ఉండాలి. లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం తొలి ఎకరానికి ప్రభుత్వం రైతు భరోసా అందిస్తోంది. ఎన్ని ఎకరాలు ఉన్నవారికైనా సరే తొలి ఎకరానికి రూ.6 వేలు తొలి విడతలో పొందనున్నారు. మరో వారం లో మూడో విడత నిధులను విడుదల చేస్తామని చెబుతున్నారు. లబ్దిదారులందరీ అకౌంట్లలో రూ.6 వేల జమ కానున్నాయి. రైతు భరోసా అందనివారు అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం సూచిస్తోంది. అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకం అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications