'కాళేశ్వరం' కేసులో కేసీఆర్, హరీష్, స్మిత సబర్వాల్ కు బిగ్ రిలీఫ్- కీలక మలుపు..!!
మాజీ సీఎం కేసీఆర్ అండ్ టీం కు బిగ్ రిలీఫ్. కేసీఆర్ హయాలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పై విచారణ చేసిన ఘోష్ నివేదిక పై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు మరియు సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. విచారణ ప్రక్రియలో సహజ న్యాయ సూత్రాలను విస్మరించారని, నిబంధనలకు విరుద్ధంగా విచారణ సాగిందని కోర్టు అభిప్రాయపడింది. దీంతో, కేసీఆర్ తో పాటుగా హరీష్.. స్మితా సబర్వాల్ కు రిలీఫ్ దక్కింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌కు తెలంగాణ హైకోర్టులోఊరట లభించింది. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ధర్మాసనం నిలిపివేసింది. జస్టిస్ ఘోష్ కమిషన్ చట్టబద్ధమేనని న్యాయస్థానం తెలిపింది. అయితే రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పిటిషనర్లు కేసీఆర్, హరీశ్ రావుతో పాటు ఐఏఎస్ అధికారులు స్మిత సబర్వాల్, ఎస్‌కే జోషికి ఊరట దక్కింది. ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చిలో జీవో నంబర్ 6ను జారీ చేస్తూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. అయితే ఘోష్ కమిషన్‌ను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు, ఐఏఎస్ అధికారులు స్మిత సబర్వాల్, ఎస్‌కే జోషి పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానంలో సుదీర్ఘంగా విచారణ జరిగింది.

హైకోర్టు తాజా ఆదేశాలతో ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్
ఈ పిటిషన్లపై ఏప్రిల్ 8న వాదనలు ముగియగా తీర్పును హైకోర్టు ఈరోజుకు(ఏప్రిల్ 22) వాయిదా వేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 6ను సమర్థించిన హైకోర్టు.. జీవో నంబర్ 6ను ఆధారంగా ఏర్పాటైన కమిషన్‌ను విచారణ జరిపిన నివేదికను అసెంబ్లీలో చర్చ జరగకుండానే మీడియా ముందుకు తీసుకురావడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. కమిషన్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో నివేదిక ఆధారంగా క్రిమినల్ చర్యలు లేదా తదుపరి విచారణలు చేపట్టాలనుకున్న ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా లేదా అన్నది ఇప్పుడు స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications