తెలంగాణలో పురుషులకు ఎక్కువగా ఈ సమస్యే.. షాకింగ్ రిపోర్ట్ !!

తెలంగాణ పురుషుల్లో జుట్టు రాలే సమస్య ఆందోళనకర స్థాయికి చేరుకుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా యువతలో హెయిర్ ఫాల్, జుట్టు పలచబడటం, బట్టతల వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం జీర్ణ ఆరోగ్యం క్షీణించడమేనని 'త్రాయ్ హెల్త్' సంస్థ నిర్వహించిన "జాతీయ గట్-హెయిర్ హెల్త్ సర్వే"లో తేలింది.

కాగా డిసెంబర్ 2024 నుంచి డిసెంబర్ 2025 వరకు దేశవ్యాప్తంగా 1.6 లక్షల మంది పురుషులపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో తెలంగాణకు సంబంధించిన గణాంకాలు అత్యంత ఆందోళనకరంగా కనిపించాయి. 2024లో 19.13 శాతంగా ఉన్న మంచి జీర్ణ ఆరోగ్యం 2025 నాటికి 15.03 శాతానికి పడిపోయింది. అంటే కేవలం ఏడాది వ్యవధిలోనే 4.10 శాతం క్షీణత నమోదైంది. దేశవ్యాప్తంగా ఇదే అత్యధిక తగ్గుదలగా నివేదిక పేర్కొంది. రాజస్థాన్‌లో 3.3 శాతం, ఢిల్లీలో 2.97 శాతం క్షీణత నమోదవగా, తెలంగాణ పరిస్థితి మరింత దిగజారడం నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.

telangana-men-facing-hair-fall-and-hair-loss-as-the-most-common-for-all-and-health-report-goes-viral

ఐటీ జీవనశైలి.. ఫాస్ట్ ఫుడ్ ప్రభావం

హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో వేగంగా మారుతున్న జీవనశైలి ఈ పరిస్థితికి ప్రధాన కారణమని నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, నైట్ షిఫ్ట్ ఉద్యోగులు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. సమయానికి భోజనం చేయకపోవడం, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, రోజంతా కూర్చునే ఉద్యోగాలు, ఒత్తిడి, నిద్రలేమి, తక్కువ నీరు తాగడం వంటి అలవాట్లు జీర్ణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు.

జీర్ణ ఆరోగ్యం దెబ్బ..

శరీరానికి అవసరమైన పోషకాలు సరైన విధంగా శోషించబడకపోతే జుట్టు కుదుళ్లకు అవసరమైన ఐరన్, జింక్, బయోటిన్, విటమిన్-B12, విటమిన్-D వంటి పోషకాలు అందవు. దీని వల్ల జుట్టు బలహీనపడి వేగంగా రాలిపోతుందని వైద్యులు వివరిస్తున్నారు. అంతేకాకుండా గట్ హెల్త్ బలహీనపడితే హార్మోన్ అసమతుల్యత, చర్మ సమస్యలు, అలసట, మానసిక ఒత్తిడి కూడా పెరుగుతాయని అంటున్నారు. ఇవన్నీ కలిసి హెయిర్ ఫాల్‌ను మరింత తీవ్రతరం చేస్తాయి.

ఈ మేరకు త్రాయ్ హెల్త్ సహ వ్యవస్థాపకురాలు Saloni Anand మాట్లాడుతూ.. "తెలంగాణకు సంబంధించిన ఈ గణాంకాలు నిర్లక్ష్యం చేయలేని హెచ్చరిక. జుట్టు సమస్యలు కేవలం కాస్మెటిక్ సమస్యలు కావు. అవి శరీర ఆరోగ్య పరిస్థితిని ప్రతిబింబిస్తాయి" అని పేర్కొన్నారు. జుట్టు రాలడాన్ని కేవలం షాంపూ, హెయిర్ ఆయిల్ లేదా హెయిర్ ట్రీట్‌మెంట్‌లతో మాత్రమే తగ్గించలేమని, అసలు సమస్యను గుర్తించి జీవనశైలిని మార్చుకోవడం అత్యంత అవసరమని ఆమె సూచించారు.

ఇటీవలి కాలంలో 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యువతలో హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. చాలా మంది ఒత్తిడి, పని భారం, ఫాస్ట్ ఫుడ్ అలవాట్ల కారణంగా ముందుగానే జుట్టు కోల్పోతున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో రూపురేఖలపై ఎక్కువ శ్రద్ధ పెరగడంతో, జుట్టు రాలడం యువతలో ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తోందని మానసిక నిపుణులు చెబుతున్నారు.

పరిష్కారం ఏమిటి?

నిపుణుల సూచనల ప్రకారం రోజూ సమయానికి భోజనం చేయడం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించడం, వ్యాయామం చేయడం, ఒత్తిడిని నియంత్రించడం ద్వారా గట్ హెల్త్‌ను మెరుగుపరచవచ్చు. అలాగే సరిపడ నిద్ర, యోగా, ధ్యానం, తాజా పండ్లు, ఆకుకూరలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం జుట్టు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+