హనీట్రాప్ ఆరోపణలు చేస్తూ బండి సంజయ్ కుమారుడి ఫిర్యాదు.. ట్విస్ట్ ఏంటంటే!
కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హనీ ట్రాప్ లో చిక్కుకున్నాడు. తనను ఒక కుటుంబం హనీ ట్రాప్ చేసి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తుందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
హనీ ట్రాప్ ఆరోపణలు చేస్తూ బండి సంజయ్ కుమారుడి ఫిర్యాదు
భగీరథ్ ఫిర్యాదు ప్రకారం.. హైదరాబాద్‌లోని కొంపల్లికి చెందిన ఓ యువతితో గత కొంతకాలం క్రితం స్నేహం ఏర్పడిందని, ఆ పరిచయం ద్వారా ఆమె కుటుంబ సభ్యులతో కూడా సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో పలుమార్లు కుటుంబ కార్యక్రమాలు, దేవాలయాల సందర్శనలకు కలిసి వెళ్లినట్లు తెలిపారు.

రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు ఫిర్యాదు
అయితే అనంతరం తనపై ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని, పెళ్లి కోసం ఒత్తిడి తెచ్చారని, అంగీకరించకపోతే తప్పుడు కేసులు పెడతామని బెదిరించారని ఆరోపించారు. అలాగే తను ఆ యువతి తో మాట్లాడిన వీడియోలు, చాటింగ్ స్క్రీన్‌షాట్లతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు భగీరథ్ ఫిర్యాదులో పేర్కొన్నారని సమాచారం. భయంతో ఇప్పటికే రూ.50 వేల వరకు చెల్లించానని కూడా ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది.
భగీరధ్ పైన హైదరాబాద్ లో యువతి కుటుంబం ఫిర్యాదు
మరోవైపు, సంబంధిత యువతి కుటుంబం కూడా భగీరథ్‌పై హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసింది. యువతి మైనర్ అని పేర్కొంటూ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. ప్రస్తుతం రెండు వర్గాల ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిజానిజాలు వెలికితీసేందుకు కరీంనగర్, హైదరాబాద్ పోలీసు బృందాలు విచారణ ముమ్మరం చేసినట్లు సమాచారం.
బండి సంజయ్ కొడుకు బాధితుడా? లేక నిందితుడా?
అయితే ఈ వ్యవహారంలో బండి సంజయ్ కుమారుడు బాధితుడు లేక నిందితుడా అన్నది పోలీసుల దర్యాప్తులో తెలియనుంది. ఇది పక్కాగా ప్లాన్ చేసిన హనీ ట్రాప్ అని భగీరధ్ వాదిస్తున్నాడు. మరోవైపు బాలిక కుటుంబం అందుకు భిన్నంగా మైనరు బాలిక పైన వేధింపులకు పాల్పడ్డాడని చెప్పడంతో ఏం జరుగుతుంది అన్నది ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.













Click it and Unblock the Notifications