కువైట్ టీడీపీ ఆధ్వర్యంలో నందమూరి హరికృష్ణ సంతాపసభ


కువైట్: తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఇటీవల నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణకు హవల్లి ప్రాంతంలో సంతాప సభ ఏర్పాటు చేసారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా టీడీపీ కువైట్ ఆధ్యక్షులు కుదరవల్లి సుధాకార్ రావు, పీఆర్ఓ మద్దిన ఈశ్వర్ నాయుడు, టిడిపి గల్ప్ కన్వీనర్ గుదె నాగార్జున చౌదరి పాల్గొన్నారు.

ఈ సందర్భముగా సుధాకర రావు మాట్లాడుతూ... హరికృష్ణ ఆకాల మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని చెప్పారు. చైతన్య రథసారథిగా, నందమూరి హరికృష్ణ సుమారు కొన్ని వేల కిలో మీటర్లు స్వయంగా రథంను నడిపించారని గుర్తు చేసుకున్నారు.

నందమూరి హరికృష్ణ ఇక లేరన్న నిజాన్ని ఇప్పటికీ తాము నమ్మలేకపోతున్నామని చెప్పారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ప్రజల మథ్యలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.

తెలుగుదేశం పార్టీకి హరికృష్ణ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి సుబ్బారెడ్డి, కోటేశ్వర్, కోవ్వూరు ప్రసాద్, సుబ్బయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.

Have a great day!
Read more...

English Summary

Kuwait Telugudesam Party mourns the death of Nandamuri Harikrishna.