జూన్ 18 నుంచి కర్కాటకం, కన్య, ధనుస్సు, మీనరాశులకు రాత్రికి రాత్రే అదృష్టం

జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదమైన, శక్తివంతమైన గ్రహంగా బృహస్పతికి ప్రత్యేక స్థానం ఉంది. ఒక వ్యక్తి జాతకంలో గురు బలం ఉంటే.. వారి జీవితంలో దేనికీ లోటుండదు. సంపద, జ్ఞానం, సంతోషం వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. కాగా, గ్రహాల రాశి మార్పుతో పాటు నక్షత్ర సంచారానికి కూడా జ్యోతిష్యంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలోనే దేవగురువు జూన్ 18వ తేదీ రాత్రి 9.00 గంటల సమయంలో 'పుష్యమి' నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుష్యమి నక్షత్రానికి అధిపతి శని దేవుడు. ఒక రకంగా శత్రు గ్రహమైన శని నక్షత్రంలోకి గురుడు ప్రవేశించడం వింతగా అనిపించినప్పటికీ, ఈ సంచారం విశ్వంలో ఒక అద్భుతమైన రాజయోగాన్ని సృష్టించబోతోంది. దీని ప్రభావంతో నాలుగు రాశుల వారి తలరాత పూర్తిగా మారిపోనుంది. ఆ రాశుల వివరాలను తెలుసుకుందాం.

Horoscope From June 18th overnight luck awaits the signs of Cancer Virgo Sagittarius and Pisces

కర్కాటక రాశి వారికి పదవులు, ప్రమోషన్ల పండుగ

పుష్యమి నక్షత్రంలో గురుడి సంచారం కర్కాటక రాశి వారికి అమృత ఘడియలను మోసుకొస్తోంది. ఆర్థికంగా మీకు తిరుగులేని కాలం ప్రారంభం కానుంది. భారీగా డబ్బు చేతికందుతుంది. కొత్త వాహనం గానీ, స్థిరాస్తి గానీ కొనుగోలు చేసే యోగం ఉంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో అద్భుతమైన ప్రమోషన్లతో పాటు జీతాల పెంపు ఉంటుంది. దీర్ఘకాలంగా వేధిస్తున్న కుటుంబ సమస్యలు తొలగిపోయి, సమాజంలో మీ గౌరవ మర్యాదలు రెట్టింపవుతాయి.

కన్యా రాశి వారికి వ్యాపారంలో లాభాల వర్షం

కన్యా రాశి వారికి ఈ గురు సంచారం అన్ని రంగాల్లోనూ విజయాలను అందిస్తుంది. మానసిక ప్రశాంతతను కల్పిస్తుంది. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. ఊహించని విధంగా ఉన్నత హోదా లభిస్తుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం బంగారు బాటలు వేస్తుంది. పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరగడం వల్ల సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మానసిక ఆందోళనలు దూరమవుతాయి.

ధనస్సు రాశి వారికి పాత సమస్యలు మాయం

సొంత రాశి అధిపతి అయిన గురుడు నక్షత్రం మారడం వల్ల ధనస్సు రాశి వారి జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. పాత అప్పులు తీరిపోతాయి. పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకోవడానికి, కొత్త వ్యాపారాలు విస్తరించడానికి ఇది సరైన సమయం. మెరుగైన ప్యాకేజీతో కొత్త ఉద్యోగంలోకి మారాలనుకునే వారి ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కోర్టు కేసులు లేదా ఇతర దీర్ఘకాలిక వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది.

మీన రాశి వారికి అదృష్టం వెంటే ఉంటుంది

మీన రాశి వారికి గురుడి అనుగ్రహంతో అడుగడుగునా అదృష్టం తోడుంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభించే సమయం ఆసన్నమైంది. కొత్త బిజినెస్ అగ్రిమెంట్లు సక్సెస్ అవుతాయి. సమాజంలో మంచి పట్టున్న వ్యక్తులతో స్నేహాలు, భాగస్వామ్యాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులు తమ కెరీర్‌కు సంబంధించి ఎప్పటినుంచో వినాలనుకుంటున్న ఒక మంచి వార్తను వింటారు. గత కొంతకాలంగా వేధిస్తున్న శారీరక నొప్పులు, అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యం నిలకడగా మారుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+