ఓపెన్ ఏఐ మైక్రోసాఫ్ట్ అలైవ్ ను మింగేస్తుంది..! సత్యనాదెళ్లకు మస్క్ హెచ్చరిక..!

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ(ఏఐ) దూకుడు ఓ రేంజ్ లో కొనసాగుతోంది. ఓవైపు ఉద్యోగులంతా ఏఐ ఎంట్రీతో తమ భవిష్యత్తు ఏంటని కంగారు పడుతున్న వేళ ఐటీ దిగ్గజ సంస్థలు మాత్రం కొత్త కొత్త ఆప్షన్లతో ఏఐ టూల్స్ కోసం వెతుకుతున్నారు. ఇందులో భాగంగా ఆయా సంస్థల మధ్య విపరీతమైన పోటీ కూడా నడుస్తోంది. ఇదే కోవలో తాజాగా ఓపెన్ ఏఐ విడుదల చేసిన ఫ్రీ వెర్షన్ జీపీటీ-5 పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, గిట్‌హబ్ కోపైలట్, అజూర్ ఏఐ ఫౌండ్రీతో తమ ప్లాట్‌ఫామ్‌లలో జీపీటీ-5 ప్రారంభించినట్లు
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఎక్స్ లో తెలిపారు. ఇది ఓపెన్ ఏఐ భాగస్వాముల నుండి ఇప్పటివరకు విడుదలైన అత్యంత సమర్థవంతమైన మోడల్ అన్నారు. ఇది అజూర్‌లో శిక్షణ పొందిన లాజిక్, కోడింగ్ , చాట్‌లో శక్తివంతమైన కొత్త అప్ డేట్స్ తీసుకువస్తుందన్నారు. దీనికి కౌంటర్ గా ట్వీట్ ను కౌంట్ చేస్తూ.. ఓపెన్ ఏఐ.. జీటీపీ 5ను మింగేస్తుందంటూ మస్క్ రీట్వీట్ చేశారు.

After GPT-5 Launch Elon Musk Predicts OpenAI Will Surpass Microsoft

ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ తనతో కలిసి రెడ్‌మండ్‌లో బింగ్‌లో జీపీటీ-4ను ప్రవేశపెట్టి కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే అయ్యిందని సత్య నాదెళ్ల తెలిపారు. అప్పటి నుండి దీని పురోగతి అద్భుతంగా ఉందన్నారు. పురోగతి వేగం పెరుగుతోందని, డెవలపర్లు, సంస్ధలు, వినియోగదారులు ఈ అప్ డేట్ తో ఏమి చేస్తారో చూడటానికి తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. దీనికి మస్క్ కౌంటర్ ఇచ్చారు.

దాంతో తిరిగి మస్క్ కు సత్య నాదెళ్ల కౌంటర్ ఇచ్చారు. ప్రజలు 50 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారని, అదే దాని సరదా అనని తెలిపారు. ప్రతి రోజు మీరు కొత్తదాన్ని నేర్చుకుంటారని, ఆవిష్కరణలు చేస్తారని భాగస్వామి అవుతారని వెల్లడించారు. అజూర్‌లో గ్రోక్ 4 కోసం యూజర్లు ఉత్సాహంగా ఉన్నారన్నారు. గ్రోక్ 5 కోసం ఎదురు చూస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+