షాకింగ్.. ట్యాక్స్ పేయర్లపై ఏఐ నిఘా.. ITR ఫైలింగ్ లో జాగ్రత్త!

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు హెచ్చరిక. పన్ను చెల్లింపుదారులు నిబంధనలను పాటించేందుకు ఐటీ రిటర్న్ దిశా నిర్దేశం చేసేందుకు, అలాగే తప్పుడు వ్యవహారాలను గుర్తించడానికి కూడా ఆదాయపన్ను శాఖ చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తోంది. భారతదేశంలో కృత్రిమ మేధస్సు (AI) మోసపూరిత పన్ను క్లెయిమ్‌లను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

ఆదాయపు పన్ను శాఖలో ఏఐ

ఆదాయపు పన్ను శాఖలో ఏ ఐ ను విస్తృత డేటాను విశ్లేషించడానికి ఉపయోగిస్తున్నారు. ఇది అధికారులకు పన్ను చెల్లింపులో వ్యత్యాసాలు మరియు పన్నుల చెల్లింపులో జరుగుతున్న మోసాలను మరింత సమర్థవంతంగా గుర్తించడంలో సహాయపడుతోంది. పన్ను చెల్లింపు విధానాన్ని మెరుగుపరచడం మరియు ఆదాయ నష్టాలను తగ్గించడం కోసం ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కు ఏఐ బాగా ఉపయోగపడుతుంది.

AI key role In Income Tax Fraud Detection In India be careful when filing ITR

Take a Poll

పన్ను చెల్లింపుదారుల తీరు తెన్నులను పరిశీలిస్తున్న ఆదాయపు పన్ను శాఖ

మానవ వనరుల ద్వారా కన్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మోసపూరిత కార్యకలాపాలను త్వరగా గుర్తించవచ్చని ఆదాయపు పన్ను శాఖ భావిస్తోంది. ఈ క్రమంలోనే కృత్రిమ మేధ సాయంతో పన్ను చెల్లింపుదారుల తీరు తెన్నులను పరిశీలిస్తున్నట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు. భారత ప్రభుత్వం తన పన్ను వ్యవస్థలలో AIని సమగ్రంగా ఉపయోగించుకుంటుంది.

వేగవంతంగా మోసాలను గుర్తించే ఏఐ

పన్ను రిటర్న్‌లను పరిశీలించి అనుమానాస్పద నమూనాలను గుర్తించడానికి, పెద్ద డేటాసెట్‌లను ప్రాసెస్ చేయడం ద్వారా, AI మోసపూరిత కార్యకలాపాలను సూచించే అసాధారణతలను త్వరగా గుర్తించటానికి ఉపయోగపడుతుంది. ఈ విధానం గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా, సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఖచ్చితత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

ఏఐ తో ఖచ్చితమైన సమాచారం

పన్ను చెల్లింపుదారులు, సంస్థల ఆర్థిక లావాదేవీల గురించి వార్షిక సమాచార నివేదిక అయిన ఏఐఎస్ లో వారికి సంబంధించి పూర్తి వివరాలు ఉంటాయి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఖచ్చితమైన సమాచారం అందించడానికి ఇది సహాయపడుతుంది. ఈ క్రమంలో ఒక యూజర్ ఎన్నిసార్లు తన ఏఐఎస్ ను యాక్సిస్ చేస్తున్నారన్న దానిపైన దృష్టి సారించిన అధికారులు పన్ను చెల్లింపుదారులు సగటున 3.5సార్లు ఏఐఎస్ పోర్టల్ ను సందర్శిస్తున్నట్టు గమనించారు.

ఏఐ ఆధారిత డేటా విశ్లేషణ

650 కోట్లకు పైగా ఆర్థిక లావాదేవీలకు 40 కోట్ల ఏఐఎస్ జనరేట్ అయినప్పటికీ గత ఏడాది కేవలం 9 కోట్ల టాక్స్ రిటర్న్ లు మాత్రమే దాఖలు కావడం, పన్ను చెల్లింపుదారుల ఇతర ఉద్దేశాలను వ్యక్తీకరిస్తుంది అని ఐటీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇదంతా ఏఐ ఆధారిత డేటా విశ్లేషణ ద్వారా గుర్తించారు.

ఆదాయపు పన్ను శాఖలో కీలకంగా మారిన ఏఐ

దీని ద్వారా సదరు పన్ను చెల్లింపుదారులకు మెయిల్ ద్వారా గాని, మెసేజ్ ద్వారా గాని సందేశాన్ని పంపి చర్యలు తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు అన్ని రంగాలలోనూ తన శక్తిని చూపిస్తూ, ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖకు కూడా మోసాలను గుర్తించడానికి కీలకంగా దోహదం చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+