భారత సైన్యంలో AI మెషీన్ గన్స్.. రక్షణారంగంలో కీలక అడుగు!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు ప్రతి రంగంలోనూ కీలకంగా మారింది. ప్రస్తుతం భారత రక్షణ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక కీలకమైన భూమిక పోషించే అవకాశం కనిపిస్తుంది. దీంతో మానవ వనరులకు బదులుగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మిషన్ గన్స్ ను ఉపయోగించి శత్రు నాశనం చేయాలని భారత్ భావిస్తోంది.

ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ప్రాజెక్ట్ ల కోసం వంద కోట్లు కేటాయిస్తున్న రక్షణా రంగం
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధన మరియు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం 100 కోట్ల రూపాయలను కేటాయిస్తోంది. ఇది మన ప్రభుత్వం యొక్క మేకిన్ ఇండియా రక్షణ ఉత్పత్తి ప్రణాళికలో భాగంగా ఉంది. ఈ ఉత్పత్తిలో 1.75 లక్షల కోట్లను, ఎగుమతుల్లో 35 వేల కోట్లను లక్ష్యంగా చేసుకుంది.

AI Mechine guns in Indian army destroy enemy on it s own

Take a Poll

ఏఐ సాయంతో రక్షణా సామర్ధ్యం పెంచుకునే పనిలో భారత్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అభివృద్ధి చేస్తున్న రక్షణ ప్రాజెక్టులు ప్రతికూల పరిస్థితుల్లో మన దళాలకు సహాయపడే విధంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే డ్రోన్లు, మానవ రహిత గ్రౌండ్ వెహికల్స్, స్వయం ప్రతిపత్తితో నడిచే జలాంతర్గాములు వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శక్తితో కూడిన రక్షణ వ్యవస్థలను నిర్మించడానికి భారతదేశం వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

ఏఐ ఆధారిత మెషీన్ గన్స్ పరీక్షించిన భారత్ సైన్యం
ఈ క్రమంలోనే శత్రువును తనంతట తానే గుర్తించి దాడి చేసే ఏఐ ఆధారిత మెషీన్ గన్స్ ను భారత సైన్యం పరీక్షిస్తుంది. బెంగళూరుకు చెందిన రక్షణ సంస్థ బిఎస్ఎస్ అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రిత నెగెవ్ లైట్ మెషీన్ గన్ స్వయం చాలిత పద్ధతిలో పనిచేస్తుంది. అది దానికదే పనిచేస్తూ యుద్ధభూమిలో సైనికుల స్థానాన్ని భర్తీ చేయడమే కాకుండా, శత్రువుల పైన వీరోచిత పోరాటాన్ని చేసి, సక్సెస్ ఫుల్ గా దాడి చేస్తుంది.

ఏఐ ఆధారిత తుపాకీ మంచి పనితీరు కనబరిచిందన్న బీఎస్ఎస్
ఇటీవల నిర్వహించిన పరీక్షలలో ఈ ఏఐ ఆధారిత తుపాకీ మంచి పనితీరును కనబరిచిందని బి ఎస్ ఎస్ సంస్థ పేర్కొంది. 2025 జూన్ 1వ తేదీ నుండి 8వ తేదీ మధ్య బెంగళూరుకు చెందిన రక్షణ సంస్థ బి ఎస్ ఎస్ 7.62 × 51 మిల్లీమీటర్ బ్యారెల్ తో అమర్చబడిన ఏఐ నియంత్రిత లైట్ మెషీన్ గన్ ను పరీక్షించింది.

రక్షణా రంగంలో కీలకమైన అడుగు
ఈ మెషీన్ గన్ 300 మీటర్ల వరకు లక్ష్యాలను విజయవంతంగా గుర్తించి ట్రాక్ చేసింది. 600 మీటర్ల వద్ద కచ్చితత్వంతో టార్గెట్ ను ఫిక్స్ చేస్తుంది. ఇది వెయ్యి మీటర్ల పరిధి వరకు ప్రభావవంతంగా పనిచేస్తుందని బి ఎస్ ఎస్ వెల్లడించింది. భారతదేశం యొక్క రక్షణ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో స్వయం చాలిత మెషీన్ గన్ పనిచేసే విధంగా తీసుకున్న కీలకమైన అడుగు ఇది అని చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+