Bharat-VISTAAR: అన్నదాతలకు కేంద్రం మరో శుభవార్త-రేపే ప్రారంభం..!
రైతులకు వ్యవసాయంలో అవసరమైన అన్ని సలహాల్ని ఒకే ఏఐ టూల్ లేదా ఫోన్ కాల్ దూరంలో అందించేందుకు కేంద్రం భారత్-విస్తార్ పేరుతో కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తోంది.
దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. రైతులకు ప్రభుత్వం నుంచి అందించాల్సిన సమాచారాన్ని ఏఐ సాయంతో వారి సొంత భాషల్లోనే అందించేందుకు కేంద్రం ఓ భారీ ప్రాజెక్టును చేపట్టబోతోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర బడ్జెట్ లో ప్రకటన చేసిన కేంద్రం.. రేపు దాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు సిద్దమైంది. భారత్-విస్తార్ (Bharat-VISTAAR) పేరుతో ప్రారంభించబోతున్న ఈ ప్రాజెక్టు ఏఐ సాయంతో రైతులకు అవసరమైన ఎన్నో అంశాల్లో ఉపయోగపడనుంది.
రైతుల కోసం కేంద్రం ఏఐ టూల్ (Bharat-VISTAAR)
రైతులకు వారి స్వంత భాషలో సమాచారం అందించేందుకు కృత్రిమ మేథ ఆధారిత 'భారత్-విస్తార్' (వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చరల్ రిసోర్సెస్)ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ కలిసి జైపూర్‌లో దీనిని ప్రారంభిస్తారు. ఈ టూల్ ప్రణాళిక, వ్యవసాయ పద్ధతులు, తెగుళ్ల నియంత్రణ, వాతావరణ అంచనాలు, మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాల సమాచారం, అర్హతలు, దరఖాస్తు విధానం, ఫిర్యాదుల పరిష్కారం వంటి అనేక విషయాలపై రైతులకు మార్గదర్శనం చేస్తుంది. మొబైల్ లేదా సాధారణ ఫోన్ కాల్ ద్వారా దీన్ని యాక్సెస్ చేయవచ్చు.

24 గంటలూ అందుబాటులో ఉండేలా
భారత్-విస్తార్ ఒక 'డిజిటల్ వ్యవసాయ నిపుణుడు'గా రోజుకు 24 గంటలు అందుబాటులో ఉంటుంది. రైతులు 155261 నంబర్‌కు డయల్ చేయడం ద్వారా దీనిని వాడుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌లోని ఏఐ సహాయకుడికి 'భారతి' అని పేరు పెట్టారు. ఈ ప్రయోగం తర్వాత, రైతులు పీఎం-కిసాన్, పీఎం ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), సాయిల్ హెల్త్ కార్డ్ (ఎస్‌హెచ్‌సీ), మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్‌వెన్షన్ స్కీమ్, సబ్-మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్, పర్ డ్రాప్ మోర్ క్రాప్, పీఎం కృషి సించాయి యోజన, పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్, అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, కిసాన్ క్రెడిట్ కార్డ్ వంటి పది ప్రధాన కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరణాత్మక సమాచారం పొందవచ్చు.

బడ్జెట్లో 150 కోట్ల నిధుల కేటాయింపు
అంతేకాకుండా వాతావరణ పరిస్థితులు, తెగుళ్ల వ్యాప్తికి సంబంధించిన ముఖ్యమైన హెచ్చరికలు కూడా ఈ యాప్ సాయంతో సకాలంలో రైతులకు అందుతాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 కేంద్ర బడ్జెట్‌లో 'భారత్-విస్తార్' ప్రాజెక్టును ప్రకటించారు. ఇది వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుందని, రైతులకు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుందని, పర్సనలైజ్డ్ సలహా మద్దతును అందించడం ద్వారా ప్రమాదాల్ని తగ్గిస్తుందని నిర్మాల సీతారామన్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్రం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్లు కేటాయించింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications