ఏఐ టూల్స్ వాడకం వస్తే చాలదు..! మరో బాంబు పేల్చిన బిల్ గేట్స్..!

ఏఐ టూల్స్ వాడకం వచ్చినంత మాత్రాన ఉద్యోగులు తమ ఉద్యోగాలు నిలబెట్టుకోలేరని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్ధాపకుడు బిల్ గేట్స్ తేల్చిచెప్పేశారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కృత్రిమ మేథ (ఏఐ) దూసుకొచ్చేస్తుందని, ఉద్యోగాలను భారీ సంఖ్యలో మింగేస్తుందని, దీనికి విరుగుడుగా ఏఐ టూల్స్ పై పట్టు సాధించాలనే వాదన వినిపిస్తోంది. అయితే ఇందులో ఏఐ దూకుడు, ఉద్యోగాలను మింగేయడం వరకూ నిజమే అయినా ఏఐ టూల్స్ వాడకం నేర్చుకున్నంత మాత్రాన ఉద్యోగ భద్రత సాధ్యం కాదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తేల్చిచెప్పేశారు.

తాజాగా సీఎన్ఎన్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ బిల్ గేట్స్ ఏఐ టూల్స్ వాడకం ద్వారా ఉద్యోగాలు నిలబెట్టుకోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐ సరదాగా, శక్తివంతంగా ఉంటుందని, అయితే కేవలం డిజిటల్ నైపుణ్యాలు ఉద్యోగాల తొలగింపు (లే ఆఫ్స్ ) నుంచి రక్షించలేవని ఆయన తేల్చిచెప్పేశారు. అయితే యువతకు తాను గతంలో ఇచ్చిన సలహానే ఆయన మరోసారి ఇచ్చారు. ఏఐపై ఆసక్తి పెంచుకోవాలని, సరికొత్త టూల్స్ వాడాలని బిల్ గేట్స్ సూచించారు.

AI Proficiency Isn t Enough Bill Gates Stark Warning to Generation Z

ఏఐ వల్ల ఉత్పాదకత మరింత పెరుగుతుందని, ఇది కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుందని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. ఉత్పాదకత పెరిగితే అది మంచిదేనన్నారు. తద్వారా ఉద్యోగులు ఎక్కువ సెలవులు తీసుకోవడానికి లేదా, ఇంకా ఎక్కువ పని చేయడానికి వీలు కల్పిస్తుందన్నారు. కాబట్టి ఇది చెడు విషయం కాదని బిల్ గేట్స్ తెలిపారు. ఏఐ సాధారణ కోడింగ్ పనులను ఆటోమేట్ చేయగలదని గేట్స్ అంగీకరించారు. కాబట్టి ఉద్యోగాలు కావాలనుకునే వారు అప్రమత్తంగా ఉండాలని గేట్స్ సూచించారు.

AI Proficiency Isn t Enough Bill Gates Stark Warning to Generation Z

అయితే మరింత సంక్లిష్టమైన పనులు ప్రస్తుతం దాని పరిధికి బయట ఉన్నాయని బిల్ గేట్స్ వెల్లడించారు. భవిష్యత్తులో బ్లూ-కాలర్ ఉద్యోగాలు కూడా ఏఐ ప్రభావానికి గురవుతాయని ఆయన అంచనా వేశారు. రోబోటిక్ చేతులు మెరుగ్గా మారినప్పుడుపెద్ద ఎత్తున శ్రామిక తరగతిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయని గేట్స్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం మాత్రం వాటి పరిస్ధితి ఆ స్ధాయిలో లేదన్నారు. బిల్ గేట్స్ తాజా వ్యాఖ్యలతో ఏఐ వాడకం, నైపుణ్యాల విషయంలో నేటి ఉద్యోగార్ధులకు మరింత క్లారిటీ వచ్చినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+