AI తీసుకురాబోతున్న కొత్త ఉద్యోగాలు..! నిపుణుల అంచనాలివే..!

కృత్రిమ మేథ రాక కారణంగా కొన్ని ఉద్యోగాల స్వరూపం పూర్తిగా మారిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ టెక్నాలజీ సాయంతో చాలా మంది కొత్త ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని వారు చెప్తున్నారు.

కృత్రిమ మేథస్సు (ఏఐ) ఎంట్రీతో ప్రపంచంలో ఉద్యోగాల స్వరూవమే మారిపోతోంది. ఇన్నాళ్లూ సేఫ్ అనుకున్న ఎన్నో ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోతున్నాయి. భవిష్యత్తులో ఏఐ కారణంగా తమ ఉద్యోగాలు ఉంటాయా లేదా అని వెతుక్కోవడం ఎక్కువైంది. ఇలాంటి పరిస్ధితుల్లోనూ ఏఐ భవిష్యత్తులో కొత్త ఉద్యోగాలు కల్పించబోతోందనే అంచనాలూ వెలువడుతున్నాయి. తాజాగా నిపుణులు దీనికి సంబంధించి తమ అంచనాలను వెల్లడించారు.

కృత్రిమ మేథ రాక కారణంగా కొన్ని ఉద్యోగాల స్వరూపం పూర్తిగా మారిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ టెక్నాలజీ సాయంతో చాలా మంది కొత్త ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. ముఖ్యంగా సంస్థలు తమ ఏఐ టూల్స్ నిర్వహించడానికి లేదా నాణ్యత తనిఖీ చేయడానికి ఉద్యోగుల్ని నియమించుకునే అవకాశం ఉందని నిపుణులు వెల్లడించారు. అలాగే మనుషులు ఆటోమేటెడ్ పనులకు దూరంగా ఉండటం వలన ఇతర కొత్త పాత్రలకు సంక్లిష్టమైన లేదా సృజనాత్మక ఆలోచన అవసరం కావచ్చని వారు తెలిపారు.

AI to create these new jobs despite negative forecasts

జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ పాలసీ ప్రొఫెసర్, యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్‌లో మాజీ చీఫ్ ఎకనామిస్ట్ అయిన హ్యారీ హోల్జర్ ఏఐ అనేది మనం నియంత్రించలేని ఒక సునామీ కాదని తెలిపారు. మనం నియంత్రించగల ప్రదేశాలు ఉన్నాయన్నారు. ఏఐ వల్ల ఉద్యోగాలకు కలిగే ఇబ్బందులపై అంచనాలు చాలా భిన్నంగా ఉన్నాయన్నారు. ఈ సాంకేతికత రాబోయే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 170 మిలియన్ ఉద్యోగాలను సృష్టించడానికి సహాయపడుతుందని, క్లాడ్ అనే ఏఐ మోడల్‌ సృష్టికర్త ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడి వెల్లడించారు.

ఏఐ నిర్దిష్టంగా తీసుకున్న ఉద్యోగాల వాటా 2023 నుండి 2024కు రెట్టింపు అయిందని మరో సంస్ధ వెల్లడించింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఈ స్థానాల వాటా గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే మరో 56 శాతం పెరిగిందని తెలిపింది. ఏఐ ఉద్యోగాలు భవిష్యత్తులో రెండు వర్గాలుగా ఉంటాయని, ఏఐ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, లాయర్లు వంటి పెద్ద పాత్రలతో పాటు సహాయ పాత్రలు కూడా ఇందులో ఉండబోతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+