"ఏఐతో 40 శాతం ఉద్యోగాలు ఖతం"

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) యుగం నడుస్తోంది. ఏఐ ప్రతి రంగంలోనూ రాణిస్తోంది. ఏఐ కారణంగా చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. అనేక రంగాల్లో మానవులకు ప్రత్యామ్నాయంగా ఏఐ టెక్నాలజీని వినియోగించడం ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్ మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2030 నాటికి ఏఐ సూపర్ ఇంటెలిజెన్స్ హోదాను సాధిస్తుందని తెలిపారు. ఏఐను టెక్నాలజీ, మానవ మేధస్సుకు అనుసంధానంగా మారుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ విధానం వల్ల భారీ స్థాయిలో ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు.


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతపై అనుమానాలు అధికం అయ్యాయి. ఈ క్రమంలో ఏఐ మానవ ఉద్యోగాలను హరించేస్తుందని వివాదం చెలరేగుతోంది. ఈ క్రమంలో ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్ మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. యాక్సెల్ స్ప్రింగర్ అవార్డు పొందిన అనంతరం సామ్ ఆల్ట్ మన్ మాట్లాడుతూ.. చాలా విధాలుగా చాట్ జీపీటీ నాకంటే తెలివైనది. అలాగే అనేకమంది కంటే కూడా జీపీటీ తెలివైనదని నేను భావిస్తున్నా.. అని అన్నారు.

Altman s AI Alarm 40 of Jobs at Risk as OpenAI CEO Predicts Task Takeover by 2030

ఏఐ భవిష్యత్తులో మానవుడు పరిష్కరించలేని ఎన్నో సవాళ్లను ఛేదిస్తుందని.. మానవతరం కాని అనేక విషయాలను కనుగొంటుందని సామ్ ఆల్ట్ స్పష్టంచేశారు. మరి కొన్ని సంవత్సరాల్లో ఏఐ ఇదంతా చాలా సులభంగా చేయగలుగుతుందని తెలిపారు. 2030 నాటికి ఏఐ మరింత శక్తివంతంగా.. సమర్థవంతంగా మారుతుందని మానవుడికి సులభంగా సాయపడుతుందని పేర్కొన్నారు. అలాగే టెక్నాలజీ మారుతున్నంత కాలం పనిలోనూ ఎన్నో మార్పులు వస్తాయన్నారు. కానీ ఈసారి అది చాలా వేగంగా జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఆల్ట్ మన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+